Krishnashtami 2024: కృష్ణాష్టమి రోజున ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే.. అదృష్టం యూటర్న్ అవుతుంది!


Krishnashtami 2024: ప్రతి సంవత్సరం వచ్చే కృష్ణాష్టమికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఈరోజును సాక్షాత్తు శ్రీకృష్ణుడే జన్మించిన రోజుగా భావిస్తారు. అందుకే చాలామంది ఈరోజు ఎంతో భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణుని పూజించి ఉపవాసాలు పాటిస్తారు. ఈ సంవత్సరం కృష్ణాష్టమి ఆగస్టు 26వ తేదీన వచ్చింది. 
 

1 /7

కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుని పూజించడమే కాకుండా ఆయనకి ఎంతో ఇష్టమైన కొన్ని వస్తువులను ఇంటికి కొనుక్కొని తీసుకు రావడం వల్ల అదృష్టం రెట్టింపు అవుతుందట. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా ఎంతో సులభంగా నెరవేరుతాయి.  

2 /7

పురాణాల ప్రకారం కృష్ణాష్టమి రోజున ఇంటికి నెమలీకను తెచ్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు మెరుగుపరగడమే కాకుండా ధన లాభాలు కలుగుతాయి.   

3 /7

నెమలీకను కృష్ణాష్టమి పండుగ రోజున తీసుకురావడం వల్ల కుటుంబంలో సత్సంబంధాలు కూడా మెరుగుపడతాయట. అంతేకాకుండా  జీవితంలో ఒత్తిడి ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని పురాణాల్లో పేర్కొన్నారు.   

4 /7

కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన వేణువును ఇంటికి తీసుకు రావడం వల్ల కూడా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా దీనిని ఇంట్లో పెట్టడం వల్ల ఇంటికి ఉన్న వాస్తు వాస్తు దోషం కూడా తొలగిపోతుంది.   

5 /7

అలాగే ఇంట్లో వేణువును ఉంచడం వల్ల కుటుంబంలో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా వ్యాపార కార్యాలయాల్లో దీనిని ఉంచడం వల్ల పురోగతి కూడా లభిస్తుంది.   

6 /7

కృష్ణాష్టమి రోజున సరస్వతీ దేవి చేతిలో ఉండే వీణను ఇంటికి తీసుకురావడం వల్ల కూడా అనేక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా పిల్లల చదువులపై ఏకాగ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని పురాణాల్లో పేర్కొన్నారు.   

7 /7

అలాగే శ్రీకృష్ణుడికి ఈరోజు తేనెతో నైవేద్యాన్ని సమర్పించడం వల్ల పుణ్యఫలం దక్కుతుందని భక్తుల నమ్మకం. దీంతోపాటు కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయట.