Trainee doctor murder case: ట్రైనీ డాక్టర్ ఘటన దేశంలో ప్రకంపనలు రేపుతుంది. ఈ ఘటనపై అన్ని వర్గాల ప్రజలు తమ నిరసలను తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోల్ కతాలోని సోనా గచిలోని సెక్స్ వర్కర్లకు చెందిన ఒక వార్త ప్రస్తుతం ట్రెండింగ్ గా మారింది.
కోల్ కతా ఘటన దేశాన్ని కుదిపేసిందని చెప్పుకొవచ్చు. ఈ ఘటనపై ప్రజలు చేపట్టిన నిరసనలు పీక్స్ కు చేరాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సైతం.. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి మరీ దర్యాప్తు చేపట్టింది. అంతేకాకుండా.. ఘటన జరిగిన పరిణామలను అన్నికోణాల్లోను విచారణ జరిపింది.
ఇదిలా ఉండగా.. కోల్ కతా ట్రైనీ డాక్టర్ ఘటనపై సుప్రీంకోర్టు సైతం తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది. అంతేకాకుండా.. ఈ కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తమ 30 ఏళ్ల సర్వీసులో ఇలాంటి ఘోరం చూడలేదని కూడా వెల్లడించింది. ఆగస్టు 9 న జూనియర్ డాక్టర్ హత్యాచారంపై తీవ్ర సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
దీనిపై అత్యున్నత ధర్మాసనం కూడా సీరియస్ గా స్పందించింది. కోల్ కతా పోలీసులు, మమతా ప్రభుత్వం, ఆర్ జీ కర్ ఆస్పత్రి వర్గాల మీద కూడా ఫైర్ అయ్యింది. ఇదిలా ఉండగా.. సీబీఐ కూడా ఘటన తర్వాత.. క్రైమ్ సీన్ ను పూర్తిగా తారుమారు చేసేలా అక్కడ పనులు జరిగాయంటూ కూడా సుప్రీంకోర్టు ముందు నివేదిక ఉంచింది.
మరోవైపు ఈ ఘటనపై సెక్స్ వర్కర్లు సైతం తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. రెడ్ లైట్ జిల్లాలోని సోనాగచిలోని కొంత మంది వేశ్యలు.. ఈ ఘటనను ఖండించారు. మహిళలు, యువతులపై అత్యాచారాలు చేయడం పట్ల ఆగ్రహాం వ్యక్తం చేశారు. తమ వద్దకు వస్తే వారికి, కాస్తంత రిలీఫ్ దొరుకుందని కూడా చెప్పారు. కోల్ కతాలో దుర్గాపూజల తయారీలో వేశ్యల నుంచి మట్టిని తీసుకుని దుర్గా దేవీ విగ్రహాలను తయారు చేస్తారంట. వందల ఏళ్ల నుంచి ఈ ఆచారంను పాటిస్తున్నారు.
ట్రైనీ ఘటన తర్వాత ఈసారి సోనాగచి వేశ్యలు తమ ఇంటి నుంచి దుర్గాపూజల విగ్రహాల తయారీకి మట్టిని ఇవ్వరని వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీనిపై సోనాగచికి చెందిన కొంత మంది వేశ్యలు క్లారీటి ఇచ్చారు.
వందల ఏళ్ల నుంచి తమ ఇంటి నుంచి నవరాత్రి దుర్గావిగ్రహాల తయారీకి మట్టి తీసుకెళ్తుంటారని చెప్పింది. కానీ కొంత మంది ఈసారి తాము.. మట్టిని ఇవ్వటానికి నిరాకరించినట్లు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. దీనిలో ఏమాత్రం నిజంలేదని.. ప్రతి ఏడాది మాదిరిగానే.. తాము విగ్రహాల తయారీకి మట్టిని ఇస్తామంటూ కూడా సోనాగచి వేశ్యలు చెప్పారు.
నవరాత్రి నేపథ్యంలో.. దుర్గావిగ్రహాలను తయారు చేస్తుంటారు. వెస్ట్ బెంగాల్ లో అనాదీగా సెక్స్ వర్కర్ ల ఇంటి నుంచి కొంత మంది మట్టిని తీసుకొచ్చి, దుర్గాపూజల విగ్రహాంను తయారు చేసే మట్టిలో మిక్స్ చేస్తారు. ఇది అక్కడ అక్కడి సంప్రదాయం. ఈ క్రమంలో కొంత మంది మార్కెట్ లో సెక్స్ వర్కర్ ల ఇంటి నుంచి తెచ్చిన మట్టి అంటూ.. కూడా మోసాలకు పాల్పడుతున్నారని కూడా సోనాగచి వేశ్యవర్కర్ లు ఆవేదన వ్యక్తంచేశారు.