Five Dream Jobs: కేవలం పడుకుంటే చాలు లక్షల్లో జీతాలిచ్చే ఐదు ఉద్యోగాలేంటో తెలుసా

హాయిగా కూర్చున్నా లేదా పడుకున్నా లక్షల్లో జీతం వచ్చి పడితే చాలు అని చాలామంది అనుకుంటుంటారు. కానీ నిజంగానే అటువంటి ఉద్యోగాలున్నాయి. కేవలం హాయిగా పడుకుంటే చాలు లక్షల్లో జీతాలిస్తారు. బ్రిటన్‌కు చెందిన లగ్జరీ బెడ్స్ కంపెనీలో నిద్రపోయే ఉద్యోగం దొరికితే 25 లక్షల శాలరీ ఉంటుంది తెలుసా. ఆశ్చర్యపోతున్నారా నిజమే. అటువంటి కంపెనీలున్నాయి. అవేంటో చూద్దామా..

Five Dream Jobs: హాయిగా కూర్చున్నా లేదా పడుకున్నా లక్షల్లో జీతం వచ్చి పడితే చాలు అని చాలామంది అనుకుంటుంటారు. కానీ నిజంగానే అటువంటి ఉద్యోగాలున్నాయి. కేవలం హాయిగా పడుకుంటే చాలు లక్షల్లో జీతాలిస్తారు. బ్రిటన్‌కు చెందిన లగ్జరీ బెడ్స్ కంపెనీలో నిద్రపోయే ఉద్యోగం దొరికితే 25 లక్షల శాలరీ ఉంటుంది తెలుసా. ఆశ్చర్యపోతున్నారా నిజమే. అటువంటి కంపెనీలున్నాయి. అవేంటో చూద్దామా..

1 /5

స్లీప్ టెస్టర్ ఈ ఉద్యోగం ప్రపంచంలోనే అత్యంత హాయినిచ్చే ఉద్యోగం. కెరీర్ ఎడిక్ట్ రిపోర్ట్ ప్రకారం చైనాకు చెందిన నావో బైజిన్ సంస్థ పడుకునే ఉద్యోగాల్ని ఇస్తుంది. ఏడాదికి 15 లక్షల వరకూ శాలరీ లభిస్తుంది. 

2 /5

ఎన్విరాన్మెంట్ స్డడీ సెంటర్ ఓ అధ్యయనం కోసం ఈ ఉద్యోగుల్ని నియమించుకున్నారు. వేరు వేరు వాతావరణ లేదా ప్రాంతాలు నిద్రపై ఎలాంటి ప్రభావితం చేస్తాయనేది తెలుసుకునేందుకు నియమించుకున్నారు. ఈ ఉద్యోగులకు ప్రతినెలా దాదాపు లక్షన్నర వరకూ చెల్లిస్తుంటారు. 

3 /5

స్లీపా్ ఎగ్జిక్యూటివ్ ఇంటీరియర్ స్పెషలిస్ట్ కంపెనీలు పరిమిత సంఖ్యలో స్లీప్ ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకుంటాయి. ఒక వ్యక్తి హాయిగా నిద్రించేందుకు కర్టెన్స్ వంటివి ఎంతవరకూ ప్రభావితం చేస్తాయనేది తెలుసుకునేందుకు ఎగ్జిక్యూటీవ్స్‌ను నియమించుకుంటాయి. ఈ పని కోసం రోజుకు పదివేల 5 వందల రూపాయల శాలరీ లభిస్తుంది. 

4 /5

స్లీప్ రీసెర్చ్ సబ్జెక్ట్ ప్రపంచంలో క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొనే ఉద్యోగాలిచ్చే ఆసుపత్రులు, క్లినిక్స్, యూనివర్శిటీ లేదా రీసెర్చ్ సెంటర్లు చాలానే ఉన్నాయి. ఇక్కడ మాత్రం బెడ్‌పై పడుకునే ఉద్యోగాలిస్తారు. కెరీర్ ఎడిక్ట్‌కు చెందిన ఓ నివేదిక ప్రకారం ఈ పనికోసం కంపెనీలు వంద డాలర్ల నుంచి 3 వేల డాలర్లు అంటే  7 వేల 5 వందల రూపాయల్నించి రెండున్నర లక్షల వరకూ చెల్లిస్తాయి.

5 /5

బెడ్ అండ్ మ్యాట్రెస్ టెస్టర్  ఈ ఉద్యోగం చేసే వ్యక్తి లేదా మహిళ రోజుకు 6-7 గంటలు బెడ్‌పైనే ఉండాల్సి వస్తుంది. క్రాఫ్టెట్ బెడ్స్ కంపెనీలో మ్యాట్రెస్ టెస్టర్ ఉద్యోగం అది. ఈ ఉద్యోగి ఆ బెడ్‌పై పడుకుని రివ్యూ చేయాల్సి ఉంటుంది.