Budget 2025: నిర్మలమ్మ కరుణునిస్తుందా? కేంద్ర బడ్జెట్ సామాన్య ప్రజలపై ఏవిధంగా ప్రభావం చూపనుంది?

Budget 2025: ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ ఉండనుంది. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబించే బడ్జెట్ సామాన్యులపై కూడా ప్రభావం చూపుతుంది. కేంద్ర బడ్జెట్ ప్రజల ఆదాయాన్ని నేరుగా ప్రభావితం చేసే విషయమని తెలిసిందే. అయితే ఈ సారి కేంద్ర బడ్జెట్ సామాన్య ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపనుందో తెలుసుకుందాం. 
 

1 /6

Budget 2025: ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ గురించి ఇప్పటికే చాలా అంచనాలే ఉన్నాయి. బడ్జెట్ సామాన్యుల ఆదాయ వ్యయాలపై కూడా ప్రభావం చూపిస్తుంది. ప్రజలు ఆదాయపు పన్నుకు సంబంధించిన విషయంతో సహా అనేక మార్పులను ఆశిస్తున్నారు.  

2 /6

 బడ్జెట్లో వినియోగాన్ని ప్రోత్సహించే విధానాలను కూడా రూపొందించే ఛాన్స్ ఉంది. అయితే సామాన్య ప్రజల జీవనవ్యయం తగ్గించే ప్రణాళికలు కూడా ఈ బడ్జెట్ లో ఉండే అవకాశాలు ఉంటాయి. సామాన్య ప్రజల ఆదాయం వస్తువులు సేవలు ధరల స్థాయిని బట్టి బడ్జెట్ ప్రభావితం చేస్తుంది. వివిధ రంగాలు సబ్సిడీలతో ధరల్లో గణనీయమైన మార్పులు ఉంటాయి. ఇది వ్యయ విధానాలు జీవన ప్రమాణాల మీద ఆధారపడి ఉంటుంది.  ప్రజాకర్షక బడ్జెట్ ప్రవేశపెడతారని ఆశిస్తున్నారు జనం. కేంద్ర బడ్జెట్ సామాన్యుల ఆదాయాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.  

3 /6

 బడ్జెట్లో ఆమోదించిన పన్ను ముఖ్యంగా ఆదాయపు పన్ను లేదా వస్తువుల పన్ను లో సామాన్యుల మీద నేరుగా ప్రభావితం చేస్తుంది. పన్ను తగ్గితే చేతిలో డబ్బు పెరుగుతుంది. జీవన వ్యయం కూడా తగ్గుతుంది. దీంతో జనాల ఆదాయం పెరుగుతుంది. పన్ను పెంచితే సామాన్యుడి ఆదాయం తగ్గి  ఖర్చులు పెరుగుతాయి.  

4 /6

బడ్జెట్లోని పలు పథకాలు అంటే సామాజిక భద్రతా పథకాలు ఉపాధి హామీ, వ్యవసాయ సహాయం లాంటి లాభదాయకంగా ఉంటే సామాన్యుల ఆదాయాన్ని పెంచే అంశం నిర్దిష్ట రకాల ఆర్ధిక సహాయం వివిధ ఆధార్ లింక్డ్ చెల్లింపుల ద్వారా ప్రజలు ప్రత్యక్ష ఆర్థిక సహాయాన్ని పొందవచ్చు.  

5 /6

 ప్రభుత్వ ఆరోగ్య పథకాలు ఆస్పత్రి సేవల మెరుగుదల వల్ల ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది. విద్యార్థులకు స్కాలర్‌షిప్స్, గ్రాండ్లు మొదలైన వాటి ద్వారా అధిక ఆదాయ అవకాశాలను పొందవచ్చు. ద్వారా అనేక పెట్టుబడులు విధానాలు ప్రోత్సహిస్తే సామాన్యుల ఆదాయం మార్గాలు పెరిగి ప్రజలకు ప్రయోజనం ఉంటుంది. బడ్జెట్లో వ్యవసాయ రంగంలో పెట్టుబడులు ఫైనాన్సింగ్ ధరల ద్రవ్యోల్బణ నియంత్రణ చర్యలు వ్యవసాయ కార్మికులు, చిన్న తరహా పరిశ్రమల ఆదాయ పరిస్థితులను మెరుగు పరుస్తాయి.  

6 /6

బడ్జెట్లో మార్పులు స్టార్టప్ కు మినహాయింపులను పెంచడం ద్వారా చిన్న వ్యాపారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. బడ్జెట్లో పారిశ్రామిక అభివృద్ధి పెట్టుబడిలో నిర్మాణ ప్రాజెక్టులో ప్రభుత్వ రంగ పనులు ఉపాధి అవకాశాలను సృష్టించడం ద్వారా ప్రజల ఆదాయంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ప్రభుత్వ పెట్టుబడులు పరిశ్రమలకు ప్రోత్సాహకాలు మరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు ఉపయోగకరంగా ఉంటాయి.