Kiran Abbavaram- Rahasya Gorak: భార్యకు ఖరీదైన బహుమతి.. విలువ తెలిస్తే షాక్..!

Kiran Abbavaram wedding: 2019లో వచ్చిన రాజావారు రాణీ గారు చిత్రంతో  తెలుగు  తెరకు పరిచయమైన కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ మొదటి చిత్రంతోనే ప్రేమలో పడిపోయారు. రహస్యంగా తమ ప్రేమను కొనసాగించిన ఈ జంట గురువారం అనగా ఆగస్టు 22 2024న అత్యంత సన్నిహితులు, స్నేహితులు, ఇరువురు కుటుంబ సభ్యుల సమక్షంలో కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు 

1 /5

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.  తన అద్భుతమైన నటనతో విభిన్నమైన కథల ఎంపికతో అందరినీ ఆకట్టుకునే ఈయన ప్రస్తుతం క అనే సినిమాలో నటిస్తున్నారు. ఒకవైపు ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే మరొకవైపు తన ప్రేయసి ప్రముఖ హీరోయిన్ రహస్యతో ఏడు అడుగులు వేశారు.

2 /5

తాజాగా కర్ణాటకలోని కూర్గ్ లో ఉన్న ఒక ప్రైవేటు హోటల్లో కిరణ్ అబ్బవరం తన ప్రేయసి రహస్య గోరక్ మెడలో మూడు ముళ్ళు వేసి తన భార్యను చేసుకున్నారు. ఈ జంటకు సంబంధించిన పెళ్లి వీడియోలు , ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. 

3 /5

వివాహానికంటే ముందు మూడు రోజులపాటు ఘనంగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు తాజాగా ఈ జంటకు సంబంధించిన పెళ్లి ఫోటోలు, వీడియోలు వైరల్ అవ్వడంతో పలువురు సెలబ్రిటీలు,  అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు   

4 /5

ఇదిలా ఉండగా తాజాగా.. ఈ జంటకు సంబంధించిన ఒక వార్త తెరపైకి వచ్చింది. దాదాపు 5 సంవత్సరాల ప్రేమ..  నేటితో జీవితంలో కొత్త అధ్యాయానికి దారితీసింది.  ఇన్ని సంవత్సరాల ప్రేమకు నేడు పెళ్లితో బ్రేక్ పడిందని చెప్పవచ్చు. ఈ సందర్భంగా తన భార్యపై ఉన్న ప్రేమను చూపించుకున్నారు కిరణ్ అబ్బవరం. 

5 /5

తాజాగా తన భార్యపై ఉన్న ప్రేమను చూపిస్తూ పెళ్లి సందర్భంగా అత్యంత ఖరీదైన డైమండ్ నెక్లెస్ ను ఆమెకు బహుమతిగా ఇచ్చారట. అంతేకాదు దాని విలువ సుమారుగా కోటి రూపాయల పైనే ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అయితే కిరణ్ అబ్బవరం ఆమె పై ఉన్న ప్రేమను ఈ విధంగా చూపించారంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్తలు సోషల్ మీడియాలో చాలా మారుతున్నాయి.  ప్రస్తుతం కిరణ్ అబ్బవరం తన తాజా చిత్రం క సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. మరొకవైపు శ్రావణమాసం సందర్భంగా బలం ముహూర్తాలు ఉండడంతో ఈ జంట ఏడడుగులు వేసి మూడుముళ్ల బంధంతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.