Keerthy Suresh: కొత్త లుక్ తో.. తమిళ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించిన కీర్తి సురేష్..

Keerthy Suresh Rare Photos కీర్తి సురేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తాజాగా ఈ హీరోయిన్ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి..

1 /5

మహానటి సినిమాతో నంది అవార్డు అందుకోవడమే కాకుండా తెలుగు ప్రేక్షకుల మధ్యలో చెరిగిపోని స్థానం కూడా సంపాదించుకుంది హీరోయిన్ కీర్తి సురేష్.

2 /5

ఈ మళయాలి భామ తెలుగులోనే కాకుండా తమిళంలో, మలయాళం లో కూడా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి మెప్పించింది. ప్రస్తుతం వరుణ్ ధావన్ సినిమాతో హిందీలోకి సైతం ఎంట్రీ ఇవ్వనుంది.

3 /5

తిరుమల కిషోర్ నేను శైలజా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కీర్తి సురేష్ కి మహానటి తర్వాత ఎన్నో ఫ్లాపులు వచ్చాయి. అయినా కానీ ఈ హీరోయిన్ క్రేజ్ తెలుగులో కొంచెం కూడా తగ్గలేదు.

4 /5

దాదాపు 8 ఫ్లాప్స్ తరువాత నాని దసరా సినిమాతో మరో సూపర్ హిట్ అందుకొని తన ఎంతో రుజువు చేసింది. కాగా సినిమాలతోనే కాకుండా తన ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా కూడా ప్రేక్షకులను తరచూ అలరిస్తూ ఉంటుంది ఈ హీరోయిన్.

5 /5

తాజాగా తమిళ న్యూ ఇయర్ సందర్భంగా కీర్తి సురేష్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఆమె అభిమానులను ప్రేమలో పడేస్తున్నాయి.