Kasturi shankar controversy: నటి కస్తూరీ శంకర్ ఎట్టకేలకు హైదరబాద్ లోని గచ్చిబౌలీలో దొరికిపోయినట్లు తెలుస్తొంది. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నటి కస్తూరీ కొన్నిరోజులుగా పోలీసులకు కళ్లు గప్పి తప్పించుకుని తిరుగుతున్నారు. తెలుగు వాళ్లపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆమె మెడకు చుట్టుకున్నట్లు తెలుస్తొంది.
నవంబరు 3వ తేదీ ఎగ్మూర్ రాజరత్నం స్టేడియం సమీపంలో హిందూ మక్కల్ కట్చి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో నటి కస్తూరి పాల్గొన్నారు. ఈ సమయంలో తెలుగు వారి పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
తమిళనాడులో రాజుల కాలంలో.. అంతఃపుర మహారాణులకు పరిచారకులుగా అంటే సేవకులుగా పనిచేయడానికి తెలుగువారు తమిళనాడుకి వచ్చారంటూ కస్తూరీ మాట్లాడారు. ఇది కాస్త రచ్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో పోలీసు స్టేషన్ లు కేసులు నమోదయ్యాయి. నవంబరు 3వ తేదీ ఎగ్మూర్ రాజరత్నం స్టేడియం సమీపంలో హిందూ మక్కల్ కట్చి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో నటి కస్తూరి .. తెలుగు వారిపై నోరు పారేసుకుంది.
అప్పటి నుంచి పరారీలో ఉన్నట్లు తెలుస్తొంది. అంతే కాకుండా.. ఆమె మద్రాస్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తొంది.కోర్టు సైతం కస్తూరీకి చుక్కలు చూపించింది. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ పిటిషన్ ను కొట్టివేసింది.
దీంతో కస్తూరీ అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతుంది. పోలీసులు ప్రత్యేకంగా కస్తూరీకోసం గాలింపు చర్యలు ప్రారంభించాయి. ఆమె సన్నిహితులు, స్నేహితులు, ఫోన్ లపై నిఘాను ఉంచారు.
తాజాగా, ఆమె హైదరబాద్ లోని గచ్చిబౌలీలో ఉన్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో చెన్నై పోలీసులు రంగంలోకి దిగి నటి కస్తూరీని అదుపులోకి తీసుకుని చెన్నై తరలిస్తున్నట్లు తెలుస్తొంది.