Karwa chauth 2022 : కర్వాచౌత్ స్పెషల్.. కొత్త జంటల సందడి.. కత్రినా-విక్కీ జోడి పిక్స్ వైరల్

Karwa chauth 2022 కర్వాచౌత్‌ సందర్భంగా తమ తమ భర్తల కోసం భార్యలు రోజంతా ఉపవాసం ఉంటూ సాయంత్రానికి ఇలా జల్లెడలో తమ భర్తల మొహాలను చూసి మురిసిపోయారు. ఈ సందర్భంగా బాలీవుడ్ తారలు తళుక్కున మెరిశారు.

  • Oct 14, 2022, 07:43 AM IST
1 /5

బాలీవుడ్ సింగర్ నేహా కక్కర్ ఇలా కర్వా చౌత్ సందర్భంగా తన భర్తతో కలిసి సందడి చేసింది. రోహన్ ప్రీత్ సింగ్ కోసం నేహా కక్కర్ ఇలా వ్రతాన్ని చూసి చివరకు ఫోటోలకు పోజులు ఇచ్చింది.

2 /5

బాలీవుడ్ క్రేజీ జంటలో వరుణ్‌ ధావన్ నటాషా దలాల్ ఉంటుంది. తన భర్త మీద ఈగ కూడా వాలనివ్వకుండా చూసుకుంటుంది నటాషా. తన భర్త గురించి రొమాంటిక్ ముచ్చట్లు చెప్పి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటుంది. తాజాగా కర్వా చౌత్‌లో భాగంగా ఇలా ఈ జోడి సందడి చేసింది.

3 /5

నాగిని భామ మౌనీ రాయ్ ఈ ఏడాది ప్రారంభంలో పెళ్లి చేసుకుంది. మౌనీ రాయ్ తన భర్త సూరజ్ నంబియార్ కోసం ఈ కర్వా చౌత్ వ్రతాన్ని చేసింది. ఈ ఫోటోల్లో జల్లెడలో తన భర్త మొహాన్ని చూసి మౌనీ రాయ్ మురిసిపోతోంది.

4 /5

కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ పెళ్లి గత ఏడాది డిసెంబర్లో జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ జోడికి ఇదే మొదటి కర్వా చౌత్. దీంతో కత్రినా ఎంతో ప్రత్యేకంగా ఈ వ్రతాన్ని చేపట్టింది. ఇక ఈ ఫోటోల్లో కత్రినా విక్కీ జోడి మరింత అందంగా కనిపిస్తోంది.  

5 /5

Karwa chauth 2022 : కర్వాచౌత్‌కు ఉత్తరాదిన ఉండే ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. అశ్వినీ మాసంలో పౌర్ణమి వచ్చిన నాలుగు రోజుల తరువాత ఈ కర్వా చౌత్‌ను జరుపుకుంటారు. భర్త యోగక్షేమాల కోసం భార్యలు చేసే వ్రతమే కర్వా చౌత్. ఉదయం అంతా కూడా ఉపవాసాలు ఉండి సాయంత్రానికి ఇలా జల్లెడ లాంటి వస్తువులో భర్త మొహాన్ని చూసి వ్రతాన్ని పూర్తి చేస్తారు.