Kangana ranaut: బిగ్ షాక్ ఇచ్చిన కంగానా రనౌత్.. ఎంపీగా గెలిస్తే ఆ పని చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు..

Loksabha elections 2024: బాలీవుడ్ నటి కంగాన రనౌత్  మండి నియోజక వర్గం నుంచి బరిలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె జాతీయ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాశంగా మారాయి. 

1 /8

బీజేపీ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హిమచల్ ప్రదేశ్ లోని మండి నుంచి ఎన్నికల బరిలో నిలబడ్డారు. ఎన్నికల ప్రచారంలో యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ఇటీవల కంగానా మండి నుంచి తన నామినేషన్ సైతం దాఖలు చేసిన విషయంత తెలిసిందే.

2 /8

ఇదిలా ఉండగా.. ఇటీవల కంగాన రనౌత్ అనేక సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీ గెలిస్తే పాక్ కు గాజులు వేసుకునేలా చేస్తామంటూ వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా ఇండియా కూటమిపై అనేక వేదికల మీద కంగనా ఫైర్ అయ్యారు. 

3 /8

కాంగ్రెస్ పాక్ వద్ద ఉన్న అణుబాంబులను చూసి భయపడుతున్నాయని ఎద్దేవా చేశారు. అదే విధంగా.. రాజకీయాలు వేరని, సినిమాలు వేరని కంగానా అన్నారు. రాజకీయాల్లో గెలవడం చాలా కష్టమన్నారు.  సమయానికి తిండి ఉండదు. ప్రజల కోసం  అన్నిరకాల త్యాగాలు చేయాల్సి ఉంటుందన్నారు.

4 /8

ఈ క్రమంలోనే కంగానా ఇటీవల హిమచల్ ప్రదేశ్ లోని మండిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.  జాతీయ మీడియా ఇంటర్య్వూలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇటు రాజకీయ వర్గాల్లోను, అటు బాలీవుడ్ లోను తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మండి నుంచి ఎంపీగా గెలిస్తే మీ తదుపరి సినిమాల్లో ఉంటారా?.. అని ప్రశ్నలు వేశారు.

5 /8

కంగానా రనౌత్ దీనికి సమాధానంగా.. తాను ఎంపీగా గెలిస్తే బాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంటానని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. బాలీవుడ్ లో ఎన్నో విజయాలు, నటిగా అవార్డులు గెలుచుకున్నానని తెలిపారు.  

6 /8

ఇక ఎంపీగా గెలిచి మండి ప్రజలకు తన వంతుగా ఏదైన మంచి చేయాలనుందని ఆమె చెప్పారు. ప్రస్తుతం ఈ వార్త ఇటు రాజకీయాల్లోను, అటు బాలీవుడ్ లోను ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

7 /8

ప్రస్తుతం కంగనా రనౌత్ నటిస్తున్న ఎమర్జెన్సీ సినిమా  వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు కంగనా స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. 1975 నుండి 1977 వరకు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించిన 21 నెలల కాలం ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. 

8 /8

పొలిటికల్ పీరియడ్ డ్రామాలో ఇందిరా గాంధీ పాత్రను కంగనా రాసింది.  కంగానా వ్యాఖ్యలు పట్ల ఆమె అభిమానులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో.. అనేక మంది దర్శకులు, నిర్మాతలు ఆమెను సినిమా రంగంనుంచి దూరంగా ఉండోద్దని చెబుతున్నట్లు కంగానా చెప్పుకొచ్చారు.