Jr NTR remuneration: జూనియర్ ఎన్టీఆర్ టీవీ షో పారితోషికం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ఓ టీవీ షో చేయనున్నట్టు ఇటీవల టాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తొలుత మీలో ఎవరు కోటీశ్వరుడు అనే రియాలిటీ గేమ్ షో 5వ సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేయనున్నట్టు వార్తలొచ్చినప్పటికీ.. అందులో ఎంతమేరకు నిజం ఉందనేది తెలియరాలేదు.

  • Dec 16, 2020, 23:51 PM IST

Jr NTR remuneration for his new TV show : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ఓ టీవీ షో చేయనున్నట్టు ఇటీవల టాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తొలుత మీలో ఎవరు కోటీశ్వరుడు అనే రియాలిటీ గేమ్ షో 5వ సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేయనున్నట్టు వార్తలొచ్చినప్పటికీ.. అందులో ఎంతమేరకు నిజం ఉందనేది తెలియరాలేదు. అదే సమయంలో ఎన్టీఆర్ చేయబోయే టీవీ షో మీలో ఎవరు కోటీశ్వరుడు కాదు.. మరో టీవీ ఛానెల్‌కి చెందిన కొత్తరకం షో అనే ప్రచారం సైతం జరిగింది.

1 /6

తారక్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీతో బిజీగా ఉన్నాడు. దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రాంచరణ్‌తో కలిసి నటిస్తున్న ఈ సినిమాలో తారక్ కొమరం భీమ్ పాత్ర చేస్తుండగా.. రాంచరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

2 /6

ఓవైపు ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ ( RRR movie shooting ) చేస్తూనే మరోవైపు తారక్ ఈ టీవీ షో చేయనున్నాడు. ఆర్ఆర్ఆర్ మూవీ లాంటి ప్రతిష్టాత్మకమైన చిత్రంలో నటిస్తూనే అదే సమయంలో ఎన్టీఆర్ ఈ టీవీ షోను హోస్ట్ చేయడానికి సిద్ధపడ్డాడంటే అందుకుగాను ఎన్టీఆర్‌కి అందుతున్న పారితోషికం ఎంత పెద్ద మొత్తంలో ఉండి ఉంటుంది అనే టాక్ కూడా వినిపించింది.

3 /6

ఎన్టీఆర్ హోస్టింగ్ చేయనున్న టీవీ షోకి ఎన్టీఆర్‌కి అందనున్న పారితోషికంపై తాజాగా ఓ సరికొత్త ప్రచారం ఊపందుకుంది. 

4 /6

ఎన్టీఆర్ ఈ టీవీ షోను హోస్ట్ చేసినందుకుగాను ఆయనకు అక్షరాల రూ. 16 కోట్లు పారితోషికంగా అందనున్నట్టు ఫిలింనగర్ టాక్. అయితే దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటనలు వెలువడలేదు.

5 /6

అలాగని ఎన్టీఆర్‌కి అంత పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ( Jr NTR remuneration ) ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఆడియెన్స్‌లో ఎన్టీఆర్‌కి ఉన్న భారీ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది మరి.

6 /6

ఎన్టీఆర్‌కి వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై కూడా అంతే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే విషయం బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ఫస్ట్ సీజన్‌తోనే ( Bigg boss Telugu ) అర్థమైపోయింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫస్ట్ షోను హోస్ట్ చేసిన ఎన్టీఆర్... తన హోస్టింగ్ స్కిల్స్‌తో ఆ షోకు భారీ సంఖ్యలో ఆడియెన్స్ సొంతమయ్యేందుకు కారణమయ్యాడు.