Jaya Ekadashi 2024: జయ ఏకాదశి.. రేపు ఇలా చేస్తే కోరుకున్న అమ్మాయితో పెళ్లి, బ్యాంక్ బ్యాలెన్స్ డబుల్..

Lord Vishnu: ఏకాదశి తిథి ఎంతో పవిత్రమైనదిగా చాలా మంది భావిస్తారు. జయ ఏకాదశి.. పేరులోనే జయం ఉంది.. అందుకే ఈ రోజున ఏ  చిన్న పనిచేసిన, ఏ పని ప్రారంభించిన అది దిగ్విజయంగా పూర్తవుతుందని జ్యోతిష్యులు చెబుతుంటారు. ముఖ్యంగా విష్ణుభక్తులు ఈ రోజున ఉపవాసం చేస్తారు. ఉదయాన్నే లేచీ తలంటూ స్నానంచేసి, స్వామివారికి ప్రత్యేకంగా భక్తితో పూజలు చేస్తారు. 

1 /6

విష్ణువుకు ఏకాదశి తిథి అంటే ఎంతో ఇష్టమంటారు. అందుకే ఈ రోజున విష్ణు ఆలయాలు భక్తులతో కిట కిటలాడుతుంటాయి. దశావతారాల్లో రాముడు, శ్రీకృష్ణుడు,అవతారాలను ప్రజలు ఎక్కువగా ఫాలో అవుతుంటారు. విష్ణువు అలంకార ప్రియుడంటారు

2 /6

ఆయన విగ్రహం, గుడి పరిసరాలను ఆరోజున అందంగా అలంకరిస్తే మనల్ని అనుగ్రహిస్తాడంటారు. ముఖ్యంగా విష్ణువుకు తులసీ ఆకులంటే ఎంతో ప్రీతి. అందుకే ఆరోజున తులసీని సమర్పిస్తారు. అదే విధంగా.. వెన్నను కూడా చాలా మంది నైవేద్యంగా చూపిస్తుంటారు.

3 /6

ప్రతినెల రెండు సార్లు ఏకాదశి పండుగ వస్తుంది. ఏకాదశి రాత్రి జాగరణ చేస్తే కోటిజన్మల పుణ్యం వస్తుందని చెబుతుంటారు. సంవత్సరంపాటు ఏకాదశి వ్రతం చేస్తే మనం ఏ కొరిక కొరుకున్న కూడా తీరిపోతుందంటారు. ముఖ్యంగా పెళ్లికానీ వారు, పెళ్లిలో ఆటంకాలు వస్తున్న వారు ఈరోజున రుక్మిణి కళ్యాణం చదువుకుంటే వెంటనే పెళ్లి సెటిల్ అవుతుంది.  

4 /6

ఇక కొందరు ఎంత సంపాదించిన కూడా డబ్బు అస్సలు నిలువదు. నెలతిరిగే సరికి పూర్తిగా ఖాళీగా అయిపోతుంటారు. ఇలాంటి వారు కూడా ఏకాదశి వ్రతం చేస్తే ఏంతో కలసి వస్తుందంటారు. ఏకాదశి రోజు విష్ణు ఆలయంలో రావి చెట్టు నీడలో దీపారాధన చేయాలి. నల్ల చీమలకు చక్కెర తినడానికి ఇవ్వాలి.   

5 /6

ఏకాదశి రోజున..తెలుపు రంగు వస్త్రం, బియ్యం, చక్కెర దానం ఇస్తే మంచి జరుగుతుంది. ఏకాదశి రోజు ఉదయంపూట పెళ్లికానీ వారు బకెట్ లో చిటికెడు పసుపు వేసుకుని స్నానం చేయాలి. ఇలా ఒక మండలం రోజులు చేస్తే వెంటనే పెళ్లికుదురుతుందని చెబుతారు

6 /6

ఉద్యోగంలో ప్రమోషన్ ఆలస్యమైన కూడా .. ఏకాదశి రోజున విష్ణుఆలయంలో ఆంజనేయ స్వామి వారి కొత్త  జెండాను పెట్టాలి. అలా చేస్తే మనం చేసిన పాపాలు అన్ని కూడా తొలగిపోయి మంచి జరుగుతుంది. అందుకే విష్ణువును జయ ఏకాదశి రోజు భక్తితో కొలుచుకుందాం.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)