Janhvi Kapoor: మత్తెక్కిస్తున్న జాన్వి కపూర్ కొత్త ఫోటోలు.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే

Janhvi Kapoor latest Instagram photos: దేవర.. సినిమాతో త్వరలో తెలుగుపేక్షకుల ముందుకి రానుంది శ్రీదేవి కూతురు జాన్వి కపూర్. అయితే ఈ సినిమా విడుదల కాకముందే.. తన ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా తెలుగు ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. తాజాగా జాహ్నవి కపూర్ మరిన్ని ఫోటోలు సోషల్ మీడియా మధ్యమాలో వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
 

1 /5

ఇప్పటివరకు తెలుగులో.. ఒక్క సినిమా కూడా చెయ్యకపోయినా.. శ్రీదేవి కూతురుగా అందరికీ సుపరిచితురాలే.. జాన్వి కపూర్. బాలీవుడ్ లో ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాలలో నటించింది ఈ హీరోయిన్. ఇక త్వరలోనే తెలుగులో కూడా దేవర.. చిత్రంతో ఎంట్రీ ఇవ్వనుంది. 

2 /5

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న దేవర.. సినిమాకి కొరటాల శివ.. దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమాతో ఫైనల్గా తెలుగు ప్రేక్షకులకు వెండితెరపై కనిపించనుంది జాన్వీ కపూర్. 

3 /5

అలనాటి అతిలోక సుందరి శ్రీదేవి పైన ఉన్న ప్రేమతో.. తెలుగు ప్రేక్షకులు అందరూ ఎప్పుడెప్పుడు జాన్వి కపూర్ తెలుగులో డెబ్యూ ఇస్తుందా అని ఎదురు చూశారు. అందుకే దేవర సినిమా విడుదల కాకముందే.. జాన్వి కపూడికి తెలుగు ఇండస్ట్రీలో కూడా ఎంతోమంది అభిమానులు లభించారు. ఇక మొదటి చిత్రం విడుదల కాకముందే మరో రంగు తెలుగు సినిమాలు కూడా సైన్ చేసింది ఈ హీరోయిన్. 

4 /5

దేవర చిత్రం తరువాత రామ్ చరణ్ 16వ సినిమాలో కూడా జాన్వి కపూర్ నటించబోతోంది. అంతేకాకుండా నాని తదుపరి సినిమాలో కూడా జాన్వీ కపూర్ ని తీసుకున్నారు అన్న వార్తలు.. తెగ వైరల్ అవుతున్నాయి. 

5 /5

ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. తాజాగా జాన్వి కపూర్ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తున్న ఫోటోలు కూడా ప్రేక్షకులను తెగ అలరిస్తున్నాయి. చీరల్లో, మోదరన్ డ్రస్సుల్లో కనిపిస్తూ.. తనకు ఎలాంటి దుస్తులు.. అయినా సూట్ అవుతాయి అని రుజువు చేస్తోంది ఈ హీరోయిన్. మొత్తానికి ఈ ఫోటోలతో తన అభిమానులను ఫిదా చేస్తోంది నేతి తరం అతిలోకసుందరి.