Stomach Pain: ఏం తిన్నా పొట్ట నొప్పిగా ఉంటుందా? ఈ టిప్స్‌తో 10 నిమిషాల్లో మాయం..

How To Get Rid Of A Stomach Ache Fast Without Medicine: ఆధునిక జీవనశైలి కారణంగా తరచుగా పొట్ట సమస్యలు రావడం సర్వసాధరణమైంది. అనారోగ్యకరమైన ఆహారాలు తినేవారిలో ఇలాంటి సమస్యలు తరచుగా వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి సమస్యల నుంచి సాధరణంగా ఉపశమనం పొందడానికి ఈ చిట్కాలు పాటించండి..

 

How To Get Rid Of A Stomach Ache Fast Without Medicine: అతిగా అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తినడం వల్ల చాలా మందిలో తీవ్ర పొట్ట సమస్యలు వస్తున్నాయి. అంతేకాకుండా కొందరిలో అజీర్ణం, మలబద్దకం సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే దీని ప్రభావం శరీరంపై పడే ఛాన్స్‌ ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన పలు ఇంటి చిట్కాలు పాటించాల్సి ఉంటుంది.

1 /5

వానా కాలంలో చాలా మందిలో పొట్ట సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు గోరు వెచ్చని నీటిని తాగాల్సి ఉంటుంది. ఇలా నీటిని తాగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.  

2 /5

బెల్లం నీరు కూడా జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో ఉండే ఐరన్‌ పొట్టలోని మంట గ్యాస్‌ వంటి సమస్యలను తగ్గించేందుకు కూడా సహాయ పడుతుందది. ముఖ్యంగా మసాలలతో తయారు చేసిన ఆహారాలు తిన్నప్పుడు చాలా మందిలో ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. వీటిని నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా బెల్లం నీటిని తీసుకోవాల్సి ఉంటుంది.  

3 /5

కలబంద జ్యూస్‌ కూడా పొట్ట నొప్పులను తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు పొట్ట సమస్యలను తగ్గించడమేకాకుండా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  

4 /5

యాపిల్‌ వెనిగర్‌ వాటర్‌ కూడా పొట్ట సమస్యలను తగ్గించేందుకు సహాయపడుతుంది. ప్రతి రోజు దీనిని ఖాళీ కడుపుతో తాగడం వల్ల శరీర బరువును కూడా తగ్గించుకోవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ప్రతి రోజు దీనిని నీటిలో కలిపి తీసుకోవాలి.  

5 /5

నిమ్మరసం కూడా సాధరణ పొట్ట నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్‌ సి అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా శరీరాన్ని రక్షిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.