Hardik Pandya: రెండు మ్యాచ్‌లతోనే జీరోగా మారిన హార్దిక్ పాండ్యా చేసిన తప్పులేంటి

ఐపీఎల్ 2024 సీజన్ 17 ప్రారంభమైంది. ఐపీఎల్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ పగ్గాలు హార్దిక్ పాండ్యాకు అప్పగించడంపై భారీగా విమర్శలు చెలరేగాయి. గుజరాత్ టైటాన్స్ జట్టుకు మొదటి ప్రయత్నంలోనే కప్ అందించడం, రెండోసారి ఫైనల్ వరకూ తీసుకెళ్లడంతో ఎంతగా ప్రాచుర్యం పొందాడో.. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా అంత ట్రోల్ అయ్యాడు. ఐపీఎల్ 2024 ప్రారంభమౌతూనే హార్దిక్ హీరో నుంచి జీరో అయ్యాడు. 

Hardik Pandya: ఐపీఎల్ 2024 సీజన్ 17 ప్రారంభమైంది. ఐపీఎల్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ పగ్గాలు హార్దిక్ పాండ్యాకు అప్పగించడంపై భారీగా విమర్శలు చెలరేగాయి. గుజరాత్ టైటాన్స్ జట్టుకు మొదటి ప్రయత్నంలోనే కప్ అందించడం, రెండోసారి ఫైనల్ వరకూ తీసుకెళ్లడంతో ఎంతగా ప్రాచుర్యం పొందాడో.. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా అంత ట్రోల్ అయ్యాడు. ఐపీఎల్ 2024 ప్రారంభమౌతూనే హార్దిక్ హీరో నుంచి జీరో అయ్యాడు. 

1 /6

వరుసగా రెండు ఓటములతో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై భారీగా ట్రోలింగ్ ప్రారంభమైంది. కేవలం అభిమానులే కాదు ఇర్ఫాన్ పఠాన్ వంటి మాజీ క్రికెటర్లు సైతం హార్దిక్ పాండ్యాపై విమర్శలు చేశారు.

2 /6

బౌలింగ్ విభాగంలో హార్దిక్ పాండ్యా చేసిన తప్పులతో ప్రత్యర్ధి జట్టు చెలరేగి రికార్డు స్కోరు సాధించింది. ఏకంగా 277 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌లో కూడా బ్యాటర్‌గా విఫలమయ్యాడు.

3 /6

పవర్ ప్లే మద్యలో హార్దిక పాండ్యా బూమ్రా వంటి అద్భుత బౌలర్‌తో మొదట్లో ఒక ఓవరే వేయించాడు. వాస్తవానికి ఈ మ్యాచ్‌లో అందరికంటే తక్కువ పరుగులు ఇచ్చిన బౌలర్ బూమ్రానే

4 /6

ముంబై ఇండియన్స్ రెండవ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో మార్చ్ 27న జరిగింది. ఈ మ్యాచ్‌లో కూడా హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెనీ కన్పించింది. ఇక్కడ కూడా జస్ప్రీత్ బూమ్రాను నిర్లక్ష్యం చేశాడు. యంగ్ పేసర్ మఫాకాతో బౌలింగ్ చేయించాడు. తన మొదటి ఓవర్‌లోనే 11 పరగులు ఇచ్చేశాడు. 

5 /6

ఈసారి హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో కీలక తప్పులు చేశాడు. జస్‌ప్రీత్ బూమ్రా ఎప్పుడూ ఓపెనింగ్ అండ్ డెత్ ఓవర్లలో దిట్ట. అలాంటిది కోయిట్జే,బూమ్రా, ల్యూక్‌వుడ్ వంటి దిగ్గజ పేసర్లు ఉన్నా ఫస్ట్ తాను బౌల్ చేసి తప్పు చేశాడు. ప్రారంభ ఓవర్లలో ఏకంగా 25 పరుగులు సమర్పించుకున్నాడు. 

6 /6

ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ గుజరాత్ చేతిలో చేజేతులారా ఓడిపోయిది. బ్యాటర్‌గా హార్దిక్ పాండ్యా విఫలం కావడంతో 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.