Arjun Tendulkar Career: యువరాజ్‌ సింగ్ తండ్రి శిక్షణలో రాటుదేలిన అర్జున్ టెండూల్కర్.. తొలి మ్యాచ్‌లో ఇలా..

Arjun Tendulkar Vs KKR: తండ్రి సచిన్ టెండూల్కర్ ఓ లెజండరీ క్రికెటర్. ఆయన బాటలోనే క్రికెట్‌ను ప్రొఫెషన్‌గా ఎంచుకున్న అర్జున్ టెండూల్కర్.. గతేడాది డిసెంబర్‌లో రాజస్థాన్‌పై గోవా తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించడంతో పాటు బౌలింగ్‌లో మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. 

  • Apr 16, 2023, 22:47 PM IST
1 /5

అంతకుముందు అదే ఏడాది నవంబర్ 12న అర్జున్ గోవా తరపున తన తొలి లిస్ట్ ఎ మ్యాచ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. 2021లో హర్యానాపై టీ20ల్లో అరంగేట్రం చేసి ఒక వికెట్ తీశాడు.  

2 /5

ఇప్పటివరకు 9 టీ20 మ్యాచ్‌ల్లో అర్జున్ 6.60 ఎకానమీ రేట్‌తో కేవలం 12 వికెట్లు తీశాడు.  

3 /5

2021 సీజన్‌కు ముందు జరిగిన వేలంలో అర్జున్ టెండూల్కర్‌ను ముంబై ఇండియన్స్ రూ.20 లక్షల బేస్‌ ప్రైస్‌తో కొనుగోలు చేసింది. అయితే ఆ సీజన్‌లో ఒక మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రాలేదు.   

4 /5

గత ఏడాది జరిగిన మినీ వేలంలో మరోసారి అర్జున్ వేలంలోకి రాగా.. ముంబై జట్టు రూ.30 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసింది. రెండేళ్ల పాటు నిరీక్షణ తరువాత ఎట్టేకేలకు నేడు కేకేఆర్‌పై అరంగేట్రం చేసే అవకాశం లభించింది. ఈ మ్యాచ్‌లో రెండు ఓవర్లు వేసి 17 రన్స్ ఇచ్చాడు.   

5 /5

ముంబై కోచ్ అతుల్ గైక్వాడ్‌తోపాటు మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ ఆధ్వరంలో అర్జున్ టెండూల్కర్ ఆటలో మెళకువలు నేర్చుకున్నాడు. సెప్టెంబరు 2022లో జేపీ అత్రే మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్‌కు సిద్ధం కావడానికి అర్జున్ సింగ్ ఆధ్వర్యంలో రెండు వారాల శిక్షణ పొందాడు.