Chiranjeevi: చిరంజీవి ఫామ్ హౌస్ ఖరీదు ఎంతో తెలుసా.. ప్రత్యేకత తెలిస్తే షాక్..!

Chiranjeevi Farmhouse : మెగాస్టార్ చిరంజీవి తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల పేరు సంపాదించుకోవడంతో ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా చిరంజీవి బెంగళూరు సమీపంలో రూ .35 లక్షల విలువైన ఫామ్ హౌస్ నిర్మించుకున్నట్లు సమాచారం.
 

1 /6

మెగాస్టార్ చిరంజీవి తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో పేరు సంపాదించుకోవడంతో ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన వ్యక్తిగత జీవితంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ఫామ్ హౌస్ గురించి కూడా ఇప్పుడు వార్తలు వినిపిస్తూ ఉండడం గమనార్హం.

2 /6

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హీరోగా,  దశాబ్దాలుగా పేరు సొంతం చేసుకున్న చిరంజీవి, భారీ బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించి అంతకుమించి పేరు సొంతం చేసుకున్నారు. సినీ ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి స్వయంకృషితో నేడు మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి కష్టానికి ఎంతటి వారైనా సరే ఫిదా అవ్వాల్సిందే. 

3 /6

ఇక ఈ ఏడాది పద్మ విభూషణ్ అవార్డు అందుకోవడమే కాదు..అక్కినేని జాతీయ అవార్డును కూడా  వచ్చేనెల 28వ తేదీన అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా అందుకోబోతున్నారు. 

4 /6

ఇదిలా ఉండగా చిరంజీవికి సంబంధించిన ఫామ్ హౌస్ ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. బెంగళూరులో అత్యంత విలాసవంతమైన సౌకర్యాలతో ఈ ఫామ్ హౌస్ ను నిర్మించారట. దీని ఖరీదు అక్షరాలా రూ .30 లక్షలు. బెంగళూరు నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవనహళ్లి లో ఈ విలాసవంతమైన ఫామ్ హౌస్ ను నిర్మించుకున్నారు చిరంజీవి. అంతే కాదు ఈ ఫామ్ హౌస్ కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా దగ్గర్లో ఉంటుందట. 

5 /6

ముఖ్యంగా ప్రతి పండుగ లేదా కాస్త విరామం దొరికితే చాలు కుటుంబ సభ్యులందరితో కలిసి ఈ ఫామ్ హౌస్ ను సందర్శిస్తారట. అక్కడే కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి మెలిసి ఆ క్షణాలను ఎంజాయ్ చేస్తారట చిరంజీవి. ఇక ప్రతి సంవత్సరం జనవరిలో జరిగే సంక్రాంతి పండుగకు కచ్చితంగా ఎవరు ఎక్కడున్నా సరే ఆ ఫామ్ హౌస్ కి చేరుకుంటారని తెలుస్తోంది. 

6 /6

ఈ ఫామ్ హౌస్ ను అత్యాధునిక టెక్నాలజీతో పాటూ అంతకుమించి ప్రకృతిని తలపించేలా,  అద్భుతమైన ఆహ్లాదకరమైన ప్రదేశంగా నిర్మించుకున్నట్లు సమాచారం.  ఇక చిరంజీవి సినిమాల విషయానికొస్తే,  ప్రస్తుతం వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్న ఈయన.. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ , డివివి దానయ్య కాంబినేషన్లో సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.