Best Tourist Places: విదేశాలను తలదన్నే ఇండియాలోని టాప్ 5 పర్యాటక ప్రదేశాలివే

చాలామందికి విదేశాలు సందర్శించాలని ఉంటుంది. కానీ బడ్జెట్ కారణంగా వెనుకడుగు వేస్తుంటారు. ఈ క్రమంలో అంతకంటే అద్భుతమైన 5 పర్యాటక ప్రాంతాలు ఇండియాలో ఉన్నాయి. అవి తెలుసుకుందాం..

Best Tourist Places: చాలామందికి విదేశాలు సందర్శించాలని ఉంటుంది. కానీ బడ్జెట్ కారణంగా వెనుకడుగు వేస్తుంటారు. ఈ క్రమంలో అంతకంటే అద్భుతమైన 5 పర్యాటక ప్రాంతాలు ఇండియాలో ఉన్నాయి. అవి తెలుసుకుందాం..
 

1 /5

మైసూర్ మహారాజా ప్యాలెస్ కర్ణాటకలోని మైసూరు ప్యాలెస్ రాజసానికి, వాస్తుకళకు చిహ్నం. ఫ్రాన్స్‌లోని వైశ్రాయ్ ప్యాలెస్ గుర్తొస్తుంది. మహారాజా ప్యాలెస్ వైభవం చూడాలంటే రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి లేదు. 

2 /5

కూర్గ్, కర్ణాటక కర్ణాటకలోని కూర్గ్‌ను ఇండియన్ స్కాట్లండ్ అంటారు. ఇక్కడ పచ్చదనం నిండుగా ఉంటుంది. అద్బుతమైన అందమైన కొండల మధ్య ఉండే ప్రాంతం. పెద్ద పెద్ద కాఫీ తోటలుంటాయి.

3 /5

ఔలీ, ఉత్తరాఖండ్ మంచుతో కప్పుకుపోయుండే కొండలు, దట్టమైన అటవీ ప్రాంతం, మనోహరమైన స్కైయింగి రిజార్ట్స్ ఉండే ఔలీ చూస్తుంటే ఎవరికైనా సరే స్విట్జర్లాండ్ గుర్తుకు రావల్సిందే. చల్లని శీతలగాలులు గిలిగింతలు పెడతాయి. స్కీయింగ్ రోమాంచితంగా ఉంటుంది. ట్రెక్కింగ్ అంతకుమించిన ఆనందాన్నిస్తుంది.

4 /5

జుస్కర్ మఠం, హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్‌లోని ఎత్తైన పర్వతాలపై ఉన్న జుస్కర్ మఠం టిబెట్ మఠాల్ని గుర్తు చేస్తుంది. బౌద్ధ ధర్మం, సంస్కృతికి సంబంధించిన ఈ మఠంలో టిబెట్ వాస్తుకళ స్పష్టంగా కన్పిస్తుంది. 

5 /5

మున్నార్, కేరళ పచ్చని కొండలు, అందమైన లోయలు, పర్వత ప్రాంతాలు, టీ తోటలతో నిండి ఉంటుంది కేరళలోని మున్నార్. స్టాట్లండ్ గుర్తుకు వస్తుంది ఎవరికైనా. నమస్తే చౌక్ నుంచి పనేరరీ దృశ్యాలు చూస్తుంటే యూరప్ హిల్‌స్టేషన్స్ గుర్తొస్తాయి.