హీరో మోటార్స్ అంటే దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద టూ వీలర్ కంపెనీ. దేశంలో ప్రతి యేటా హీరో మోటోకార్ప్ అత్యధికంగా టూ వీలర్స్ విక్రయాలు చేస్తుంటుంది. ఫిబ్రవరి నెలలో దేశంలో అత్యధికంగా విక్రయమైన టాప్ 5 టూ వీలర్ కంపెనీ బైక్స్ గురించి తెలుసుకుందాం..
Top 5 Best Selling Bikes: హీరో మోటార్స్ అంటే దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద టూ వీలర్ కంపెనీ. దేశంలో ప్రతి యేటా హీరో మోటోకార్ప్ అత్యధికంగా టూ వీలర్స్ విక్రయాలు చేస్తుంటుంది. ఫిబ్రవరి నెలలో దేశంలో అత్యధికంగా విక్రయమైన టాప్ 5 టూ వీలర్ కంపెనీ బైక్స్ గురించి తెలుసుకుందాం..
టీవీఎస్ టీవీఎస్ కంపెనీ బజాజ్‌ను వెనక్కి నెట్టి మూడవ స్థానంలో నిలిచింది. 2023 ఫిబ్రవరిలో టీవీఎస్ 2,21,402 యూనిట్ల బైక్స్ విక్రయాలు చేసింది.
రాయల్ ఎన్ఫీల్డ్ దేశంలో అత్యధిక టూ వీలర్ అమ్మకాల్లో ఐదవ స్థానంలో నిలిచింది. ఫిబ్రవరి 2023లో రాయల్ ఎన్ఫీల్డ్ 64,436 యూనిట్ల అమ్మకాలు చేపట్టింది. గత ఏడాదితో పోలిస్తే 23.5 శాతం వృద్ధి నమోదు చేసింది.
హోండా ఇక హోండా కంపెనీ టూ వీలర్స్ అమ్మకాల్లో రెండవ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 2,27,084 యూనిట్లు అమ్మకాలు చేపట్టింది. హోండా యాక్టివా ఈ కంపెనీకు చెందిన లార్జెస్ట్ సెల్లర్ టూ వీలర్.
హీరో మోటోకార్ప్ టూ వీలర్ అమ్మకాల్లో హీరో మోటోకార్ప్ అగ్రస్థానంలో ఉంది. ఫిబ్రవరి 2023లో హీరో మోటోకార్ప్ 15.3 శాతం వార్షిక వృద్ధితో 3,82,317 యూనిట్లు విక్రయాలు చేసింది. గత ఏడాది ఇదే నెలలో 3,31,462 యూనిట్లు విక్రయించింది.
బజాజ్ ఇక నాలుగవ స్థానంలో బజాజ్ ఉంది. ఫిబ్రవరి 2023లో ఈ కంపెనీ 1,18,039 యూనిట్ల విక్రయాలు జరిపింది. గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 22 శాతం వృద్ధి నమోదైంది.