Airforce Day: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ డే ఉత్సవాల సన్నాహాలు, రిహార్సల్స్ ఫోటోలు వైరల్

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ..ఎయిర్‌ఫోర్స్ డే ఉత్సవాలకు సిద్ధమౌతోంది. అక్టోబర్ 8వ తేదీన 89 వ వార్షికోత్సవాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎయిర్ క్రాఫ్టులతో ఐఏఎఫ్ ప్రదర్శన నిర్వహించనుంది. ఇందులో భాగంగా ఐఏఎఫ్ ఎయిర్ క్రాఫ్టుల ప్రదర్శన రిహార్సల్స్ ఫోటోలు విడుదల చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలపై ఓ లుక్కేద్దాం.

Airforce Day: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ..ఎయిర్‌ఫోర్స్ డే ఉత్సవాలకు సిద్ధమౌతోంది. అక్టోబర్ 8వ తేదీన 89 వ వార్షికోత్సవాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎయిర్ క్రాఫ్టులతో ఐఏఎఫ్ ప్రదర్శన నిర్వహించనుంది. ఇందులో భాగంగా ఐఏఎఫ్ ఎయిర్ క్రాఫ్టుల ప్రదర్శన రిహార్సల్స్ ఫోటోలు విడుదల చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలపై ఓ లుక్కేద్దాం.
 

1 /4

హిందన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ఈ ప్రదర్శనలు నిర్వహిస్తున్నందున..ఢిల్లీ, ఘజియాబాద్ ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో చెత్త పారవేయవద్దని ఐఏఎఫ్ అధికారులు సూచిస్తున్నారు. 

2 /4

అక్టోబర్ 8వ తేదీ ఉదయం 8 గంటలకు ఏఎన్ 32 ఎయిర్ క్రాఫ్టుల ప్రదర్శనతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. అనంతరం హెరిటేజ్ ఎయిర్ క్రాఫ్ట్, మోడర్న్ ట్రాన్స్‌పోర్ట్, ఫ్రంట్‌లైన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రదర్శన ఉంటుంది.

3 /4

అత్యాధునిక ఎయిర్ క్రాఫ్టులను వేడుకల్లో ప్రదర్శించేందుకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సన్నాహాలు చేసింది. రిహార్సల్స్ ఫోటోల్ని ట్విట్టర్‌లో షేర్ చేసింది. 

4 /4

ప్రతియేటా అక్టోబర్ 8న ఎయిర్‌ఫోర్స్ డే జరుపుకుంటాం. 89వ వార్షికోత్సవాల సందర్భంగా ఐఏఎఫ్ ప్రత్యేక ప్రదర్శన నిర్వహించనుంది. ఈ ప్రదర్శనకు సంబంధించి ఇప్పటికే ఐఏఎఫ్ రిహార్సల్స్ పూర్తి చేసింది.