India vs New Zealand: గంభీర్ నమ్మకాన్ని నిలబెట్టాడు.. కివీస్‌కు చుక్కలు చూపించిన వాషింగ్టన్ సుందర్

India vs New Zealand 2nd Test Highlights: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ కివీస్‌ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించాడు. ఏడు వికెట్లతో వాషింగ్టన్ సుందర్ చెలరేగడంతో న్యూజిలాండ్ 259 పరుగులకే ఆలౌట్ అయింది. అశ్విన్ మొదటి మూడు వికెట్లు తీసి కివీస్ పతనానికి శ్రీకారం చుట్టాడు. అనంతరం టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 16 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు.
 

1 /6

టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. స్పిన్‌కు సహరించే పిచ్‌పై కివీస్ బ్యాట్స్‌మెన్ ఆచితూచి ఆడినా.. అశ్విన్ ప్రమాదకరంగా బౌలింగ్ చేశాడు. కెప్టెన్ లాథమ్ (15), కాన్వే (76), విల్ యంగ్ (18) వికెట్లను పడగొట్టాడు.  

2 /6

ఆ తరువాత వాషింగ్టన్ సుందర్ రెచ్చిపోయాడు. క్రీజ్‌లో పాతుకుపోయిన రచిన్ రవీంద్ర (65) క్లీన్‌ బౌల్డ్ చేశాడు. దీంతో 197 పరుగుల వద్ద న్యూజిలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది.  

3 /6

ఇక్కడి నుంచి వాషింగ్టన్ సుందర్ దెబ్బకు వరుసగా వికెట్లు కోల్పోయింది. మిచెల్ (18), బ్లుండెల్ (3), గ్లెన్ ఫిలిప్స్ (9), సౌథీ (9), అజాజ్ పటేల్ (4) తక్కువ స్కోర్లకే వెనుతిరిగారు.  

4 /6

చివర్లో శాంటర్న్ (33) పోరాడడంతో న్యూజిలాండ్ స్కోరు 259 పరుగులు చేసింది. నలుగురు బ్యాట్స్‌మెన్స్‌ను వాషింగ్టన్ సుందర్ క్లీన్‌బౌల్డ్ చేయడం విశేషం.  

5 /6

రెండో టెస్టు ముందు జట్టులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్.. కుల్దీప్ యాదవ్ స్థానంలో తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మేనేజ్‌మెంట్‌ను ఒప్పించి మరీ టీమ్‌లోకి తీసుకున్నాడు.  

6 /6

తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ (0)ను సౌథీ క్లీన్ బౌల్డ్ చేశాడు. బౌలర్లకు సహరించే పుణే పిచ్‌పై రెండో రోజు ఆట కీలకంగా మారనుంది.