Ibomma Vs Bappam Tv: ప్రస్తుతం చాలామంది సినిమా ధియేటర్లో ఎక్కువగా మూవీస్ చూసేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. గూగుల్ టీవీలు వచ్చినప్పటి నుంచి ఎంత వీలైతే అంత ఇళ్లలోనే ఓటీటీ ప్లాట్ఫామ్స్‌లో సినిమాలు చూస్తున్నారు. అంతేకాకుండా సినిమా టికెట్స్ రేట్లు పెరగడం కారణంగా కూడా చాలామంది సినిమాలు చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని ఇటీవలే ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా సబ్స్క్రిప్షన్ ధరలను అమాంతం పెంచేసాయి. దీంతో చాలామంది ఆల్టర్నేటివ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్‌ను ఎంచుకుంటున్నారు.
చాలామంది ఓటీటీ ప్లాట్ఫామ్స్ సబ్స్క్రిప్షన్ ధరలు పెరగడంతో ఇతర థర్డ్ పార్టీ వెబ్సైట్లను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా ఐబొమ్మలాంటి అతి ప్రమాదకరమైన వెబ్సైట్లో సినిమాలు చూస్తున్నారు. నిజానికి ఇందులో సినిమాలు చూడడం కాస్త మంచిది కాకపోయినప్పటికీ చాలామంది ఇందులో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు మాత్రమే చూస్తున్నారు.
ఐ బొమ్మ (Ibomma) తమ యూజర్స్‌ను దృష్టిలో పెట్టుకొని నిత్యం కొత్త కొత్త సినిమాలను స్ట్రీమింగ్ చేస్తూ వస్తోంది. అంతేకాకుండా ఇతర ఓటీటీ ప్లాట్ఫామ్స్‌లో రిలీజ్ అయిన సినిమాలను కూడా ఫ్రీగా స్ట్రీమింగ్ చేస్తోంది. దీంతోపాటు ప్రత్యేకమైన డౌన్లోడింగ్ ఆప్షన్ను కూడా అందిస్తోంది.
గతంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఐబొమ్మ(Ibomma)పై అనేకసార్లు ఫిర్యాదు చేసిన.. ఏ మాత్రం తగ్గకుండా ఇప్పటివరకు కొత్త మూవీస్ను స్ట్రీమింగ్ చేస్తూ వస్తోంది. అంతేకాకుండా కొత్త కొత్త డొమైన్ పేర్లతో ఐ బొమ్మ మూవీస్ను అప్లోడ్ చేస్తోంది.
అలాగే యూజర్స్ అప్డేట్ అయిన కొద్దీ ఐ బొమ్మ కూడా అప్డేట్ అవుతూ వస్తోంది. గతంలో ఐ బొమ్మ డౌన్లోడింగ్ ఆప్షన్ను తొలగించినప్పటికీ ఇప్పుడు దాని కోసం ప్రత్యేకమైన డొమైన్ ను క్రియేట్ చేసింది.
ఐ బొమ్మ (Ibomma) డౌన్లోడింగ్ ఆప్షన్‌లో భాగంగా ఇదే వెబ్సైట్‌లో ఒక సబ్ డొమైన్ను క్రియేట్ చేసింది. ఇది బప్పన్ టీవీ (Bappam Tv) పేరుతో అందుబాటులో ఉంది. ఇందులో కూడా ఐ బొమ్మ కొత్త కొత్త సినిమాలను అప్లోడ్ చేస్తోంది.
ఈ బప్పం టీవీ కూడా ఐబొమ్మ ఉన్న ప్రత్యేకమైన లోగోలో కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఐ బొమ్మ(Ibomma)లో ఉన్న సినిమా డౌన్లోడింగ్ ఆప్షన్ నొక్కగానే బొప్పం టీవీ వెబ్సైట్ కి తీసుకెళ్తుంది.
అలాగే ఐ బొమ్మ టీవీలో సులభంగా సినిమాలను డౌన్లోడ్ చేసుకునేందుకు ప్రత్యేకమైన ఆప్షన్స్ అందిస్తోంది. నేరుగా సినిమా పక్కనే డౌన్లోడింగ్ ఆప్షన్ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా సినిమాలు మరింత సులభంగా చూడడమే కాకుండా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
బప్పం టీవీ(Bappam Tv)లో సినిమాలు డౌన్లోడ్ చేసుకోవాలనుకునే వారు ముందుగా ఐ బొమ్మ వెబ్సైట్ని సందర్శించాల్సి ఉంటుంది ఇందులో డౌన్లోడింగ్ ఆప్షన్ నొక్కగానే బొప్పం టీవీకి తీసుకెళ్తుంది. ఇందులో సులభంగా కొత్త సినిమాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.