Ganesh Immersion: ట్యాంక్‌బండ్‌లో ఎన్ని గణేశ్‌ విగ్రహాలు పడ్డాయంటే?

Ganesh Immersion Completes Peacefully In Hyderabad: గణేశ్‌ వినాయక ఉత్సవాలు హైదరాబాద్‌ అంగరంగ వైభవంగా ముగిశాయి. 11 రోజులు పూజలందుకున్న గణనాథుడి శోభయాత్ర యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించింది. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌, హుస్సేన్‌సాగర్‌, మల్కంపేట, ఐడీపీఎల్‌, రాజేంద్రనగర్‌ తదితర జలాశయాల్లో నిమజ్జనం కోలాహలంగా జరిగింది.

1 /7

Ganesh Immersion: హైదరాబాద్‌లో వినాయక మహా నిమజ్జనం ప్రశాంతంగా ముగిసిందని తెలంగాణ పోలీస్‌ శాఖ ప్రకటించింది. 

2 /7

Ganesh Immersion: హైదరాబాద్‌లో వినాయక మహా నిమజ్జనం ప్రశాంతంగా ముగిసిందని తెలంగాణ పోలీస్‌ శాఖ ప్రకటించింది.  Ganesh Immersion: ఒక ప్రణాళిక ప్రకారం అన్ని శాఖలు సమన్వయం చేసుకుని నిమజ్జన ఘట్టం పూర్తి చేశారు.

3 /7

Ganesh Immersion: హైదరాబాద్‌లో సరూర్‌నగర్‌, హుస్సేన్‌సాగర్‌, మల్కంపేట, ఐడీపీఎల్‌, రాజేంద్రనగర్‌ తదితర చెరువుల్లో వినాయక విగ్రహాలు నిమజ్జనాలు జరిగాయి.

4 /7

Ganesh Immersion: అత్యంత ప్రధానమైన హుస్సేన్ సాగర్‌లో భారీగా విగ్రహాల నిమజ్జనం జరిగింది. ఒక్కరోజే 20 వేల విగ్రహాలు నిమజ్జనమయ్యాయి.

5 /7

Ganesh Immersion: అయితే వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి 11వ రోజు వరకు ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనమైన విగ్రహాల సంఖ్య లక్షకు పైగా ఉన్నాయని అధికారులు ప్రకటించారు.

6 /7

Ganesh Immersion: మిగతా సరూర్‌నగర్‌ తదితర జలాశయాల్లో మరో లక్ష విగ్రహాలు నిమజ్జనం అయినట్లు తెలుస్తోంది.

7 /7

Ganesh Immersion: ప్రజల సహకారంతో అన్ని వర్గాల సహకారంతో ప్రశాంతంగా గణేశ్‌ నిమజ్జనం పూర్తి చేసుకున్నందుకు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ చేతులెత్తి ధన్యవాదాలు తెలపడం విశేషం.