Paytm new feature: పర్సనల్ లోన్ కావాలా..రెండు నిమిషాల్లోనే..ఎలా అప్లై చేయాలంటే

పర్సనల్ లోన్ కావాలంటే బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. పేటీఎం ( Paytm ) నుంచే చేయవచ్చు. పేటీఎం తన కస్టమర్ల కోసం పేటీఎం లెండింగ్ పేరుతో కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. దీని సహాయంతో పర్సనల్ లోన్ కోసం అప్లై చేయవచ్చు. 
  • Jan 06, 2021, 17:59 PM IST

Paytm new feature: పర్సనల్ లోన్ కావాలంటే బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. పేటీఎం ( Paytm ) నుంచే చేయవచ్చు. పేటీఎం తన కస్టమర్ల కోసం పేటీఎం లెండింగ్ పేరుతో కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. దీని సహాయంతో పర్సనల్ లోన్ కోసం అప్లై చేయవచ్చు. 

1 /4

లోన్ తీసుకోవాలనుకునే కస్టమర్..పేటీఎం యాప్ ( Paytm app ) లో ఫైనాన్షియల్ సర్వీస్ సెక్షన్ లోకి వెళ్లాలి. తరువాత పర్సనల్ లోన్ పై క్లిక్ చేసి..తరువాత ఇచ్చే వివరాలు నమోదు చేయాలి. 

2 /4

పేటీఎం ( Paytm ) నుంచి మీరు కేవలం 2 నిమిషాల్లోనే లోన్ తీసుకోవచ్చు. దీన్ని మీరు 18 నుంచి 36 నెలల్లోగా ఈఎంఈ పద్దతిలో చెల్లించవచ్చు. తమ కలల్ని సాకారం చేసుకునేవారి కోసం ఈ సౌకర్యాన్ని ప్రవేశపెట్టామని పేటీఎం చెబుతోంది. తాత్కాలిక అవసరాలు పూర్తి చేసుకునేలా షార్ట్ టైమ్ లోన్ కోసం ఈ సౌకర్యం ఉపయోగపడుతుంది.

3 /4

పేటీఎం లెండింగ్ ( Paytm lending ) సౌకర్యం  ద్వారా మీరు  24 గంటలూ, వీకెండ్‌లోనూ, పబ్లిక్ హాలిడేస్‌లోనూ లోన్ తీసుకోవచ్చు. పేటీఎం ఈ సౌకర్యం శాలరీ హోల్డర్స్, చిరు వ్యాపారులకు, ప్రొఫెషనల్స్ కోసం లాంచ్ చేసింది. చిన్నపట్టణాల్లో ఉండి పెద్ద బ్యాంకుల్నించి లోన్ తీసుకోలేని వారికి ఈ సౌకర్యం బాగా ఉపయోగపడుతుంది. 

4 /4

పేటీఎం లెండింగ్ ( Paytm lending ) ఫీచర్ ద్వారా ఎవరైనా సరే పర్సనల్ లోన్ కోసం అప్లై చేయవచ్చు. భాగస్వామ్య బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు మీకోసం కేవలం 2 నిమిషాల్లోనే లోన్ ప్రక్రియ ప్రారంభించేస్తాయి. ఈ కొత్త ఫీచర్ ద్వారా 2021 మార్చ్ నాటికి పది లక్షల మంది వినియోగదార్లను జోడించడమే పేటీఎం లక్ష్యంగా పెట్టుకుంది.