Horoscope In Telugu: ఈ నెలలో అమావాస్య తర్వాత రోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభం కాబోతోంది. దీంతో మంచి ఘడియలు మొదలవుతాయి. అయితే కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అదృష్టం కూడా రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏయే రాశువారు ఈ మాసంలో ఎలాంటి ఫలితాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రావణ మాసంలో కొన్ని రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని లాభాలతో పాటు ఆర్థికంగా బలపడే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
సింహ రాశివారికి ఈ శ్రావణ మాసంలో ప్రేమ బంధం మరింత బలపడుతుంది. అంతేకాకుండా తెలివి రెట్టింపు అవ్వడం వల్ల సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు. అయితే వీరికి ఈ క్రమంలో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
కర్కాటక రాశి వారికి కూడా ఈ మాసంలో అనేక లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరు విలాసవంతమైన జీవితాన్ని కూడా పొందుతారు. ఆర్థికంగా భారీ లాభాలు పొందుతారు.
శ్రావణ మాసంలో మేష రాశి పిల్లల నుంచి అనేక రకాల ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా ఈ క్రమంలో కొత్త వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా భారీ మొత్తంలో ఖర్చులు పెరుగుతాయి.
వృషభ రాశివారికి ఈ క్రమంలో ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీరు ఈ క్రమంలో కొత్త గృహాలు కొనుగోలు చేయోచ్చని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా పలు దీర్ఘకాలిక వ్యాధుల వచ్చే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.