Unlock 4లో ఈ మార్పులు అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
భారతర దేశంలో Unlock 4 సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి రానుంది. లాక్ డౌన్ వల్ల అనేక మార్పులు జరుగాయి. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. దాంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని మినహాయింపులు చేస్తున్నాయి. జీవితాన్ని సాధారణం స్థితికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి.
విమాన ప్రయాణాల చార్జీలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. సెప్టెంబేర్ 1వ తేదీ నుంచి జాతీయ, అంతర్జాతీయ చార్జీలు పెంచాలని పౌరవిమానయాన శాఖ నిర్ణయం తీసుకుంది.
సమీప భవిష్యత్తులో LPG సిలిండర్ ధరలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది. దాంతో పాటుగా పెట్రోల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.
సెప్టెంబర్ 1వ తేదీ నుంచి మెట్రో రైళ్లు 15 రోజుల పాటు ట్రయల్ చేయనున్నారు. ఇందులో 50 శాతం ప్రయాణికులను మాత్రమే ఎక్కనిస్తారు.
సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పాఠశాల, కళాశాలను ప్రారంభించేందకు కేంద్రం సూచనలు జారీ చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది
సినిమా థియేటర్లను సెప్టెంబర్ 1 నుంచి తెరిచే అనుమతి కేంద్రం ఇస్తుంది అని అంతా అనుకున్నారు. కానీ అలా జరిగే అవకాశం లేదు అని తెలుస్తోంది.