Diabetes: వీటిని తినడం వల్లే తీవ్ర మధుమేహం సమస్యలు.. కాబట్టి జాగ్రత్త..

High Sugar Foods: మధుమేహ రోగులకు తీపి పదార్థాలు విషం కంటే ఎక్కువ.. వీటిని అధిక పరిమాణంలో తీసుకుంటే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా చాలా మందిలో గుండె జబ్బులు, తీవ్ర డయాబెటిక్ సమస్యలుగా మారే ఛాన్స్‌ ఉంది.

  • Aug 23, 2022, 13:50 PM IST

High Sugar Foods: మధుమేహ రోగులకు తీపి పదార్థాలు విషం కంటే ఎక్కువ.. వీటిని అధిక పరిమాణంలో తీసుకుంటే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా చాలా మందిలో గుండె జబ్బులు, తీవ్ర డయాబెటిక్ సమస్యలుగా మారే ఛాన్స్‌ ఉంది. కావున తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేవలం అధిక పరిమాణంలో పోషకాలున్న ఆహారాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా ఆహారాన్ని డైట్‌ పద్ధతిలో పాటించడం వల్ల షుగర్‌ లేవల్స్ నియంత్రణలో ఉంటాయి.

1 /5

పెరుగును కూడా మధుమేహం ఉన్నవారు విచ్చలవిడిగా తీసుకుంటున్నారు. పెరుగును రోజూ తీసుకోవడం వల్ల తీవ్ర ప్రమాదానికి దారీ తీసే అవకాశాలున్నాయి. ఇందులో రక్తంలో చక్కెర స్థాయిని పెంచే చాలా రకాల మూలకాలుంటాయి. కావున ఇవి శరీరంలో తొందరగా షుగర్‌ లెవల్స్‌ను పెంచుతాయి.

2 /5

కోల్డ్ కాఫీలు కూడా శరీరానికి చాలా హానికరం. ఇందులో అధిక పరిమాణంలో చక్కెర ఉంటుంది. కావున శరీరంలోని రక్తంలో చక్కెర లెవెల్స్ ని సులభంగా పెంచుతుంది. ఇది చాలామందిలో తీవ్ర మధుమేహానికి కూడా దారి తీయొచ్చు. కావున మధుమేహంతో బాధపడుతున్న వాళ్ళు వీటిని  తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.

3 /5

కాఫీలో అధిక పరిమాణంలో కెఫీల్ అనే మూలకాలు ఉండడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలను అధిక పరిమాణంలో పెంచుతుంది. కావున మధుమేహంతో బాధపడుతున్న వారు కాఫీలను తీసుకోకపోవడం మంచిది. చాలామంది మధుమేహం ఉన్నవారు కోల్డ్ కాఫీలు కూడా తీసుకుంటున్నారు. ఇది కూడా వారికి ప్రమాదమేనని నిపుణులు తెలుపుతున్నాను.

4 /5

ప్రస్తుతం చాలా మంది మధుమేహం వ్యాధితో బాధపడుతున్నవారు అధిక చక్కెర గల పండ్లను తీసుకుంటున్నారు. ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను వేగంగా పెంచేందుకు సహాయపడతాయి. కావున వీటిని తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పైనాపిల్‌లో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. కావున వీటిని తీసుకోవడం చాలా మంచిది.

5 /5

కెచప్‌లు ఆహారం రుచి పెంచేందుకు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా చాలా మంది వివిధ రకాల ఆహారాలను తీసుకునే క్రమంలో కెచప్‌ వినియోగిస్తున్నారు. ఇందులో గ్లూకోజ్ స్థాయిలు పెంచే మూలకాలు అధిక పరిమాణంలో ఉండడం వల్ల ఇది రక్తంలో చక్కెర పరిమాణాన్ని పెంచుతుంది.