ఇటీవలి కాలంలో లైఫ్‌స్టైల్ వ్యాధుల ముప్పు బాగా పెరిగింది. అంటే చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా ఉత్పన్నమయ్యే అనారోగ్య సమస్యలు. వీటిలో ముఖ్యమైంది హై కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ రక్త నాళాల్లో పేరుకుపోవడం వల్ల గుండె వ్యాదులు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యలు వస్తుంటాయి.
అయితే కొలెస్ట్రాల్ విషయంలో ఆందోళన అవసరం లేదు. ఎందుకంటే నియంత్రణ పూర్తిగా మీ చేతుల్లోనే ఉంటుంది. చాలా సులభం కూడా. హెల్తీ ఫుడ్స్ తీసుకోవడమే. ప్రకృతిలో లభించే కొన్ని అద్భుతమైన పదార్ధాలను డైట్‌లో చేర్చుకుంటే కొలెస్ట్రాల్ వేగంగా తగ్గిపోతుంది. ఆ 5 ఆహార పదార్ధాలేంటో తెలుసుకుందాం.
పండ్లు ఆపిల్, ఆరెంజ్, ద్రాక్ష, దానిమ్మ వంటి పండ్లు రోజూ తీసుకుంటే కొలెస్ట్రాల్ వేగంగా కరుగుతుంది
ఆకు కూరలు ఆకు కూరల్లో పాలకూర, మెంతికూర, కొత్తిమీర, తోటకూర, కాకరకాయలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ఫైబర్ పెద్దమొత్తంలో ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ తగ్గించేందుకు, రక్తపోటు నియంత్రణకు దోహదపడుతుంది.
నట్స్ అండ్ సీడ్స్ బాదం, వాల్‌నట్స్, చియా సీడ్స్ , ఫ్లక్స్ సీడ్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఓట్స్ ఒట్స్‌లో లిక్విఫైడ్ అంటే త్వరగా సాల్యుబుల్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గించి హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ పెంచుతుంది.
వెల్లుల్లి వెల్లుల్లిలో ఉండే ఎలిసిన్ చాలా అద్భుతమైంది. దీనివల్ల కొలెస్ట్రాల్ చాలా వేగంగా కరుగుతుంది.