South Heroins Remunartions: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ భామలతో పాటు సీనియర్ హీరోయిన్స్ ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ దూకుడు మీదున్నారు. ముఖ్యంగా తెలుగులో సీనియర్ టాప్ స్టార్స్ సరసన నటిస్తూ ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం తెలుగు సహా సౌత్ హీరోయిన్స్ రెమ్యునరేషన్స్ విషయానికొస్తే..
సమంత.. సమంత టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా తెలుగు సహా సౌత్ సినీ ఇండస్ట్రీని ఊపేసింది. ప్రస్తుతం ఈమె ఒక్కో చిత్రానికి దాదాపు రూ.3 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టున్నారట. తాజాగా 'సిటాడెల్' వెబ్ సిరీస్ కోసం రూ. 3.5 కోట్ల వరకు ఛార్జ్ చేసినట్టు సమాచారం.
త్రిష.. త్రిష హీరోయిన్ గా రెండు దశాబ్దాలు కంప్లీట్ చేసుకుంది. ఈమె ఒక్కో సినిమాకు రూ. 2 కోట్ల నుంచి రూ. 2.5 కోట్ల వరకు తీసుకుంటున్నట్టు సమాచారం.'విశ్వంభర' కోసం దాదాపు రూ. 2.5 కోట్ల పారితోషకం తీసుకున్నట్టు సమాచారం.
నయనతార.. నయనతార.. ఇండస్ట్రీకి వచ్చిన 2 దశాబ్దాలవుతోంది. అంతేకాదు సౌత్ లేడీ సూపర్ స్టార్‌గా అలరిస్తోంది. నయనతార ఒక్కో చిత్రానికి దాదాపు రూ. 5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. అందుకుంటోంది.
అనుష్క శెట్టి.. అనుష్క శెట్టి .. టాలీవుడ్ టాప్ హీరోయిన్గా నటిస్తోంది. సీనియర్ హీరోలకు పర్ఫెక్ట్ ఛాయిస్. ఈమె ఒక్కో సినిమాకు రూ. 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోంది.
కాజల్ అగర్వాల్.. పెళ్లై ఓ పిల్లాడు జన్మించిన తర్వాత కూడా హీరోయిన్ గా అదే ఊపు ఊపుతుంది. భగవంత్ కేసరి సినిమా కోసం దాదాపు రూ.2 కోట్ల వరకు పారితోషకం తీసుకున్నట్టు సమాచారం.
తమన్నా.. టాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్‌లలో తమన్నా ఇప్పటికీ తన గ్లామర్ తో నెట్టుకొస్తోంది. ఈమె ఒక్కో సినిమాకు రూ.కోటి వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.
రకుల్ ప్రీత్ సింగ్.. రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం ఈ భామకు డిమాండ్ భారీగా తగ్గింది. అందుకే ఒక్కో సినిమాకు దాదాపు రూ. 70 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నదట.