Hair care tips: ఈ మధ్యకాలంలో కాలుష్యం బాగా పెరిగిపోవడంతో చిన్న వయసు నుంచే జుట్టు రాలడం అనేది ప్రతి ఒక్కరిలోనూ ఆడ మగ అనే తేడా లేకుండా కనిపిస్తోంది. ముఖ్యంగా మగవారిలో అయితే బట్టతల సమస్య తలెత్తుతోంది. అదే సమయంలో ఆడవారిలో అయితే జుట్టు పల్చగా మారడంతో వారికి పెళ్లిళ్లు సైతం జరగని పరిస్థితి ఏర్పడుతోంది.
Onions for hair: జుట్టు రాలే సమస్యను అరికట్టడానికి ఎన్ని షాంపూలు, నూనెలు వాడినా ఆగడమం లేదు. చాలా మంది జుట్టు రాలడాన్ని అరికట్టేందుకు ఇంటి చిట్కాల వైపు మొగ్గు చూపుతున్నారు. కొందరు ఉల్లిపాయల రసాన్ని జుట్టుకు, తలకు రాసుకోవం తెలిసిందే. అంతేకాదు ఉల్లిపాయ షాంపూలు కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. ఉల్లిపాయ జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలతో పోరాడుతుంది. ఉల్లిపాయ ఆధారిత నూనెతో షాంపూ చేయడం వల్ల జుట్టు రాలడాన్ని నివారిస్తుందని చాలా మంది చెబుతుంటారు.
సైన్స్ ఏం చెబుతోంది? ఉల్లిపాయల్లో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. ఈ సల్ఫర్ మూలకం జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. సాధారణంగా ఈ సల్ఫర్లు అమైనో ఆమ్లాలలో ఉంటాయి. అమైనో ఆమ్లాలు కెరాటిన్ ఇతర ప్రోటీన్ల బిల్డింగ్ బ్లాక్స్. కెరాటిన్లు జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడతాయి. ఉల్లిపాయ రసంలో ఉండే కెరాటిన్ ఉత్పత్తిని పెంచుతుంది. అయితే జుట్టు రాలడాన్ని అందులో ఉండే సల్ఫర్ నియంత్రిస్తుంది.
ఉల్లిపాయల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. కొందరికి తల మాడుపై ఇన్ఫెక్షన్ల కారణంగా జుట్టు రాలిపోతుంది. ఉల్లిపాయ రసాన్ని తలకు పట్టించడం వల్ల యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వల్ల ఇన్ఫెక్షన్లు నయమవుతాయి.అవాంఛిత రోమాలు రాలడం కూడా అదుపులోకి వస్తుంది. అంతే కాదు ఉల్లిపాయల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ జుట్టు చిట్లడం, కోతలను కూడా నివారిస్తుందని చెబుతున్నారు. కాబట్టి జుట్టు రాలిపోయే సమస్య ఉన్నవారు ఉల్లి రసాన్ని విరివిగా వాడవచ్చు.
ఉల్లిపాయ రసం ఎలా ఉపయోగించాలి: జుట్టు రాలడాన్ని నివారించడానికి ఉల్లిపాయ రసాన్ని ఇలా ఉపయోగించాలి. ఉల్లిపాయ తొక్క తీసి ముక్కలుగా చేసుకోవాలి.దీన్ని మిక్సీలో వేసి రుబ్బుకోవాలి. ఒక గుడ్డ లేదా స్ట్రైనర్లో వేసి రసాన్ని తీయండి.ఉల్లి రసంలో కొంచెం నీరు కలపండి.
ఆ తరువాత, రసాన్ని మీ చేతులతో లేదా కాటన్ ద్వారా తలపై రాయండి. మీ చేతులతో స్కాల్ప్ మొత్తాన్ని సున్నితంగా మసాజ్ చేయండి. ఇలా మర్దన చేయడం వల్ల రక్తప్రసరణ కూడా సక్రమంగా జరుగుతుంది.ఉల్లిపాయ రసాన్ని అప్లై చేసి సుమారు 30 నిమిషాలు అలాగే ఉంచండి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు ఉల్లిపాయలోని సల్ఫర్‌ను గ్రహిస్తాయి. తర్వాత గోరువెచ్చని నీటిలో షాంపూ రాసుకుని తలస్నానం చేయాలి.ఉల్లిపాయ రసం వాసనను తొలగించడానికి మీ జుట్టును బాగా కడగాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేస్తే జుట్టు రాలడం ఆగిపోతుంది. ఇన్ఫెక్షన్లు కూడా తగ్గిపోతాయి.