Herbal Tea: దేశంలో చాలామంది దినచర్య టీ తో ప్రారంభమౌతుంటుంది. ఉదయం లేవగానే టీ తాగకుంటే మనశ్శాంతిగా ఉండదు. టీ లేకుండా రోజు ప్రారంభం కాదు కొందరికి. కానీ అదే టీలో కొన్ని పదార్ధాలు కలిపి హెర్బల్ టీగా మల్చుకుంటే ఇక ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కోకొల్లలు.
రోజ్‌మెర్రీ ఫ్లవర్స్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చాలా ఎక్కువ. శరీరాన్ని వివిధ రకాల వ్యాధుల్నించి కాపాడుతుంది. శరీరంలో స్వెల్లింగ్ సమస్యను దూరం చేస్తుంది.
లెమన్ గ్రాస్ టీ లెమన్ గ్రాస్ టీ ఉదయం వేళ తాగడం మంచిది. మీ శరీరానికి ప్రశాంతత ఇస్తుంది. ఇందులో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఫిట్ అండ్ హెల్తీగా ఉంచుతాయి. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.
హర్ సింగార్ టీ హర్ సింగార్ టీ రుచిలో కూడా అద్భుతంగా ఉంటుంది. దీనివల్ల శరీరంలో రక్తం శుద్ధి అవుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వివిధ రకాల వ్యాధుల్ని దూరం చేస్తాయి. రక్తపోటును కూడా నియంత్రిస్తుంది.
దాల్చినచెక్క టీ ఒక్క డ్రాప్ టీ మెదడును కచ్చితంగా ఉత్తేజితం చేస్తుంది. అందుకే టీ లో కొన్ని పదార్ధాలు కలిపితే మరింత మంచిది. రుచి పెరుగుతుంది. లాభాలు కలుగుతాయి. దాల్చినచెక్క కొద్దిగా కలిపి టీ చేస్తే ఇమ్యూనిటీ పెరుగుతుంది. మధుమేహం వ్యాధిగ్రస్థులకు మంచిది
లవంగం టీ టీ అనేది భారతీయుల జీవితంలో ఓ భాగం అని చెప్పవచ్చు. అందుకే చాలామందికి టీ లేకుండా రోజు ప్రారంభం కాదు. టీ ఎనర్జీతో పాటు ఫ్రెష్‌నెస్ ఇస్తుంది. మీరు తాగే టీలో లవంగం కలిపితే టీ రుచి పెరగడమే కాకుండా ఆరోగ్యపరంగా చాలా లాభాలు కలుగుతాయి. వివిధ రకాల వ్యాధులు దూరమౌతాయి.