Adah Sharma Latest Pics ఆదా శర్మ తాజాగా అందాల ప్రదర్శనలో వింత భంగిమలు పెట్టేసింది. విల్లులా తన నడుమును తిప్పేసింది. అందాల ఆదా శర్మను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
పూరి జగన్నాథ్ హీరోయిన్లకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ అందరికీ తెలిసిందే. హార్ట్ ఎటాక్ సినిమాతో ఆదా శర్మకు మంచి క్రేజ్ వచ్చింది. యూత్‌ను ఆదా శర్మ ఇట్టే కట్టిపడేసింది.
ఆదా శర్మ, నితిన్ రొమాంటిక్ సీన్లు, ముద్దు సీన్లకు నిజంగానే కుర్రకారుకి హార్ట్ ఎటాక్ వచ్చినంత పనైంది. కానీ హార్ట్ ఎటాక్ తరువాత ఆదా శర్మకు అంతగా అవకాశాలు రాలేదు.
ఆదా శర్మ అడపాదడపా చిత్రాలు చేసుకుంటూ వచ్చింది. సైడ్ హీరోయిన్‌గానూ నటించింది. అయితే ఆదా శర్మకు సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా ఇమేజ్ ఏర్పడింది.
సోషల్ మీడియాలో ఆదా శర్మ చేసే విన్యాసాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఆమె డ్యాన్స్ వీడియోలు, వింత ఫోటో షూట్లు, జిమ్నాస్టిక్ వీడియోలు అందరినీ ఆకట్టుకుంటాయి.
ఆదా శర్మ తాజాగా తన ఒళ్లుని విల్లులా విరిచేసింది. ఆమె జీరో సైజ్ నడుము అందాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. కొవ్వున్నదే లేదన్నట్టుగా ఆదా శర్మ తన నడుము గురించిచెప్పుకొచ్చింది.