Healthy Liver Diet: లివర్ అనేది శరీరంలో అతి ముఖ్యమైన అంగం. శరీరంలో గుండె, కిడ్నీలు, ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమో అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత కలిగింది లివర్. లివర్ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చాలా అవసరం. శరీరంలోని వివిధ అంగాల పనితీరుని మెరుగుపర్చేంది ఇదే.
Healthy Liver Diet: అందుకే లివర్ ఆరోగ్యానికి హాని కల్గించే పదార్ధాలకూ దూరంగా ఉండాలి. లివర్ ఆరోగ్యానికి ఏవి మంచిదో తెలుసుకుని వాటిని డైట్లో బాగంగా చేసుకోవాలి. ముఖ్యంగా 5 రకాల పదార్ధాలు లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో దోహదం చేస్తాయి. ఆ ఐదు పదార్ధాల గురించి తెలుసుకుందాం..
నట్స్ నట్స్‌లో ఉండే ఫైబర్, ప్రోటీన్లు లివర్‌ను ఆరోగ్యంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. నట్స్ తినడం వల్ల లివర్ స్వెల్లింగ్ సమస్య తగ్గుతుంది.
ద్రాక్ష ద్రాక్షలో ఫ్లెవనాయిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి లివర్ దెబ్బతినకుండా కాపాడుతాయి. ద్రాక్ష రసం తాగడం వల్ల లివర్ స్వెల్లింగ్ సమస్య తగ్గిపోతుందంటారు.
ఫ్యాటీ ఫిష్ ఫ్యాటీ ఫిష్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి లివర్ ఆరోగ్యానికి ప్రయోజనకరం. ఫ్యాటీ ఫిష్ తినడం వల్ల లివర్ స్వెల్లింగ్ సమస్య తొలగిపోతుంది.
కాఫీ కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దాంతో లివర్‌కు హాని కలగకుండా కాపాడుతుంది. కాపీ తాగేవారిలో ఫ్యాటీ లివర్ సమస్య తక్కువగా ఉందని ఓ అధ్యయనంలో కూడా వెల్లడైంది.
బీట్రూట్ బీట్రూట్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. బీట్రూట్ రసం తాగడం వల్ల లివర్ పనితీరు మెరుగుపడుతుంది.