Ragi Dosa: కప్పు కొలతలతో రాగి దోశ.. హెల్దిగా బరువు తగ్గాలి అనుకుంటే ఈ దోశ ట్రై చేయండి!!

Ragi Dosa: అధిక బరువు సమస్యతో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. బరువు పెరగడం వల్ల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్య ఉన్నవారు ప్రతిరోజు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు బ్రేక్‌ఫాస్ట్‌ లో రాగి దోశ తయారు చేసుకొని తినడం వల్ల బోలెడు ఆరోగ్యలాభాలతో పాటు బరువు కూడా తగ్గవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. 

1 /6

ఆరోగ్యకరమైన జీనవశైలి కోసం మంచి పోషకాలు, విటమిన్‌లు కలిగిన ఆహారపదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా డయాబెటిస్‌, అధిక బరువు సమస్యలతో బాధపడేవారు పోషకలు నిండిని ఆహారం తీసుకోవడం చాలా అవసరం. 

2 /6

రాగి దోశ అంటే ఆరోగ్యం నిండుగా ఉండే ఒక అద్భుతమైన అల్పాహారం. ఇందులో ఉండే పోషకాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇంట్లోనే ఈ రుచికరమైన దోశను తయారు చేసుకోవడం చాలా సులభం.

3 /6

కావలసిన పదార్థాలు: రాగి పిండి, బియ్యం పిండి, పెరుగు, నీరు, ఉప్పు, జీలకర్ర, మిరియాల పొడి, కరివేపాకు, నూనె

4 /6

తయారీ విధానం: ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో రాగి పిండి, బియ్యం పిండి (ఉపయోగిస్తే), పెరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి.

5 /6

 తరువాత నీరు కొద్ది కొద్దిగా వేస్తూ కెరాటైన పిండిలా కలపాలి. పిండి చాలా పలుచగా లేదా గట్టిగా ఉండకూడదు. కలిపిన పిండిని కనీసం 4-5 గంటలు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల పిండి మరింత మృదువుగా అవుతుంది.

6 /6

నానబెట్టిన పిండిలో జీలకర్ర, మిరియాల పొడి, కరివేపాకు వేసి బాగా కలపాలి. నాన్ స్టిక్ పాన్ ను స్టౌ మీద వేడి చేసి కొద్దిగా నూనె పోసి వేడి చేయాలి. తరువాత పిండిని తీసుకొని పాన్ మీద వ్యాపించేలా వేసి దోశను వేయాలి. రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.