Raisins and Almonds: కిస్మిస్ , బాదం కలిపి తినవచ్చా, తింటే ఏమౌతుంది

Raisins and Almonds: మనిషి సంపూర్ణ ఆరోగ్యంంగా ఉండాలంటే పోషక పదార్ధాలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే రోజూ డ్రై ఫ్రూట్స్ తినమని వైద్యులు సూచిస్తుంటారు. ఈ క్రమంలోనే కిస్మిస్ , బాదం రెండూ ఒకేసారి తినవచ్చా లేదా అనే సందేహాలు కలుగుతుంటాయి. వాటి గురించి తెలుసుకుందాం..

Raisins and Almonds: డ్రై ఫ్రూట్స్‌లో దాదాపు అన్ని రకాల పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ అనగానే బాదం, కిస్మిస్, ఖర్జూరం, బాదం, వాల్‌నట్స్, పిస్తా, అంజీర్ గుర్తొస్తాయి. ప్రతి డ్రై ఫ్రూట్ దేనికదే ప్రత్యేకత సంతరించుకుని ఉంటుంది. ఇందులో కిస్మిస్, బాదం కలిపి తినవచ్చో లేదో ఇప్పుడు పరిశీలిద్దాం..

1 /6

ఎముకల్ని బలంగా మార్చేందుకు బాదం కిస్మిస్ రెండూ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ రెండు కలిపి తింటే మెరుగైన ఫలితాలుంటాయి.

2 /6

కిస్మిస్ బాదం రెండూ కలిపి తినడం వల్ల జ్ఞాపకశక్తి పెంపొందించవచ్చు. 

3 /6

బాదం కిస్మిస్ రెండూ కలిపి ఒకేసారి తినడం వల్ల చర్మం మెరుగుపడుతుంది. కొత్త నిగారింపు వచ్చి చేరుతుంది. 

4 /6

బాదం, కిస్మిస్ కలిపి ఒకేసారి తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా కేశాల సంరక్షణ కూడా సాధ్యమౌతుంది. జుట్టు పొడుగ్గా ఎదిగేందుకు దోహదపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఇ ఇందుకు ఉపయోగపడుతుంది.

5 /6

బాదం, కిస్మిస్ రెండూ కలిపి తినడం ఆరోగ్యానికి మంచిదే. శరీరానికి అదనపు శక్తి లభిస్తుంది. తరచూ ఎదురయ్యే అలసట దూరమౌతుంది. సదా ఆరోగ్యంగా ఉంటాం.

6 /6

బాదం, కిస్మిస్ రెండూ కలిపి ఒకేసారి తినవచ్చంటున్నారు న్యూట్రిషనిస్టులు. కానీ వేసవిలో మాత్రం ఈ రెండింటినీ నేరుగా తినేకంటే నానబెట్టి తినడం మంచిది.