Cholesterol Tip: ఈ పదార్ధాలు రోజూ తీసుకుంటే కేవలం వారం రోజుల్లో హై కొలెస్ట్రాల్‌కు చెక్

Cholesterol Tip: మనం రోజూ తీసుకునే ఆహారపు అలవాట్ల ప్రభావం మన శరీరంపై పడుతుంటుంది. అదే సమయంలో శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడానికి కారణంగా కూడా ఇదే అవుతుంది. ఈ క్రమంలో కొలెస్ట్రాల్ తగ్గించేందుకు హెల్తీ డైట్ తీసుకోవల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేవలం ఆహారపు అలవాట్లతోనే కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు.

Cholesterol Tip: కొలెస్ట్రాల్ అనేది ఎలాంటి సమస్య అంటే శరీరంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కొలెస్ట్రాల్ కారణంగానే అధిక రక్తపోటు, డయాబెటిస్, హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. మీ రెగ్యులర్ డైట్‌లో పండ్లు, కూరగాయలు చేర్చడం ద్వారా కొలెస్ట్రాల్ చాలా వేగంగా నియంత్రించవచ్చు.
 

1 /5

తృణధాన్యాలు సైతం కొలెస్ట్రాల్ తగ్గించేందుకు చాలా బాగా పనిచేస్తాయి. వారంలో కనీసం 3 సార్లు తృణధాన్యాలు డైట్‌లో ఉంటే చాలా మంచిది. కొలెస్ట్రాల్ తగ్గించడమే కాకుండా అధిక బరువు సమస్యకు కూడా చెక్ పెడుతుంది. 

2 /5

హై కొలెస్ట్రాల్ రోగులు కూరగాయలు ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే శరీరంలో పేరుకున్న కొలెస్ట్రాల్ బయటకు తొలగించాలంటే బ్రోకలీ, కాలిఫ్లవర్, టొమాటో, క్యారెట్ , ఆకుకూరలు బాగా ఉపయోగపడతాయి.

3 /5

సోయాబీన్ సైతం కొలెస్ట్రాల్ తగ్గించేందుకు మంచి సాధనమని అంటారు. ఇందులో ప్రోటీన్లు ఎక్కువగా ఉండి కేలరీలు తక్కువగా ఉంటాయి. శరీరానికి ఎనర్జీ లభిస్తుంది. సోయాబీన్ అనేది ఆరోగ్యానికి మంచిది కూడా.

4 /5

రోజూ ఫ్రూట్స్ తీసుకోవడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంల పేరుకున్న కొలెస్ట్రాల్‌ను దూరం చేయడమే కాకుండా శరీరానికి కావల్సిన పోషకాల్ని కూడా పుష్కలంగా అందిస్తాయి. కొలెస్ట్రాల్ రోగులు సాధ్యమైనంత ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోవాలి. యాపిల్, అరటి పండ్లు, దానిమ్మ వంటివి మంచివి.

5 /5

కొలెస్ట్రాల్ తగ్గించేందుకు ఫ్లక్స్ సీడ్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి. నట్స్ కూడా గుండె ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయి. అందుకే రోజూ క్రమం తప్పకుండా ఫ్లక్స్ సీడ్స్ సేవించడం ఆరోగ్యానికి చాలా మంచిది.