Health Drinks: అధిక రక్తపోటు సమస్య అనేది ఇటీవల పెరుగుతోంది. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. అధిక రక్తపోటు కారణంగా..బ్రెయిన్ హేమరేజ్ కావచ్చు. దీన్నించి ఉపశమనం పొందేందుకు కొన్ని జ్యూస్లు తీసుకోవడం మంచిది.
టొమాటో ప్రతి ఇంట్లో ఉండేదే. టొమాటో జ్యూస్ రోజూ తాగుతుంటే రక్తపోటు సమస్య తగ్గుతుంది.
పాలకూర శరీరానికి చాలా లాభదాయకం. ఇందులో పొటాషియం తగిన మోతాదులో ఉంటుంది. ఇది రక్తపోటు నియంత్రించేందుకు దోహదపడుతుంది.
ఆనపకాయ జ్యూస్ అధిక రక్తపోటు రోగులకు చాలా ప్రయోజనకరం. బీపీ సమస్య ఉన్నవాళ్లు వారానికి కనీసం 4 సార్లు ఆనపకాయ జ్యూస్ తాగడం మంచిది.
బీట్రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పెద్దమొత్తంలో పోషక పదార్ధాలుంటాయి. ఫలితంగా గుండెపై ఒత్తిడి పెద్దగా పడదు. ఈ పరిస్థితుల్లో బీట్రూట్ జ్యూస్ బీపీ రోగులకు లాభం చేకూరుస్తుంది.
వాము ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ప్రతిరోజూ వాము నీరు తాగితే బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో ఉంటుంది.