వెలక్కాయ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. మార్కెట్‌లో లభించే అత్యంత చౌకైన ఫ్రూట్ ఇది అయితే ఆరోగ్యపరంగా కలిగే లాభాలు తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇదొక సీజనల్ ఫ్రూట్. వెలక్కాయతో కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
Health Benefits: వెలక్కాయ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. మార్కెట్‌లో లభించే అత్యంత చౌకైన ఫ్రూట్ ఇది అయితే ఆరోగ్యపరంగా కలిగే లాభాలు తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇదొక సీజనల్ ఫ్రూట్. వెలక్కాయతో కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
ఇన్సులిన్ కణాలు పెంచడంలో దోహదం చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ కారణంగా చెడు కొలెస్ట్రాల్ పూర్తిగా తొలగిపోతుంది. విటమిన్ సి చాలా ఎక్కువ పరిమాణంలో ఉంటుంది.
ఆయుర్వేదంలో చాలా మందుల తయారీలో వెలక్కాయను ఉపయోగిస్తారు.
ఇందులో ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, జింక్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇందులో విటమిన్ బి1, బి2 చాలా ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే మలబద్ధకం సమస్యను ఇట్టే మాయం చేస్తుంది.
వెలక్కాయతో చట్నీ చేసుకుని తింటారు. లేదా కొంతమంది నేరుగానే తినేస్తారు. రుచి పరంగా కాకపోయినా ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువ. దీనిని ఎలిఫెంట్ యాపిల్ అని కూడా పిలుస్తారు. ఏనుగులు అత్యంత ఇష్టంగా సేవిస్తాయి.
వెలక్కాయ ఇప్పటి జనరేషన్ వారికి చాలామందికి తెలియదు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా తీసుకుంటారు. మార్కెట్‌లో లభించే అత్యంత చౌకైనది ఇది. కేవలం 5-10 రూపాయలు మాత్రమే ఉంటుంది.