Heart Attack Signs: మనిషి శరీరంలో అతి ముఖ్యమైన అంగం గుండె. గుండె ఆరోగ్యంగా ఉన్నంతవరకే మనిషి ప్రాణం నిలబడుతుంది. ఒకసారి గుండె చప్పుడు ఆగిందంటే ప్రాణం పోయినట్టే. అందుకే గుండెను ఆరోగ్యంగా ఉంచాలి. గుండెలో ఏ చిన్న సమస్య వచ్చినా వివిధ రకాల ఇబ్బందులు ఎదురౌతుంటాయి.
Heart Attack Signs: అందుకే గుండెకు సంబంధించిన సమస్యలు లేదా కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కన్పిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. గుండెలో సమస్య ఏర్పడితే ఎలాంటి సంకేతాలు లేదా లక్షణాలు ఉంటాయో తెలుసుకుందాం..
గుండె వ్యాధుల సమస్య ఉన్నప్పుడు కడుపులో కూడా ఇబ్బంది తలెత్తవచ్చు. అందుకే కడుపు నొప్పి సమస్య తరచూ వస్తుంటే నిర్లక్ష్యం చేయకూడదు.
గుండె అనారోగ్యంగా ఉంటే గొంతు నొప్పి సమస్య అదే పనిగా వస్తుంటుంది. అందుకే ఈ లక్షణాన్ని నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.
తల తిరగడం కూడా గుండె అనారోగ్యానికి సంకేతం కావచ్చు. చాలామంది డీహైడ్రేషన్ కారణంగా ఇలా జరుగుతుందని తేలిగ్గా తీసుకుంటారు. కానీ గుండె వ్యాధుల సమస్య ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడం కూడా కష్టమౌతుంది. అందుకే ఈ లక్షణాన్ని తేలిగ్గా తీసుకోవద్దు.
గుండెను ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఛాతీలో నొప్పి లేదా అసౌకర్యం కలిగితే నిర్లక్ష్యం చేయవద్దంటున్నారు వైద్యులు. ఎందుకంటే ఛాతీలో నొప్పి గుండె పోటుకు కూడా కారణం కావచ్చు.
శరీరంలో నొప్పులు అనేవి సాధారణమే. కానీ ఎడమ చేయి నొప్పిగా ఉంటే మాత్రం అప్రమత్తం కావల్సిందే. ఇది కచ్చితంగా గుండె పోటుకు కారణం కావచ్చు.