Health Benefits: సీజన్ మారుతోంది. వర్షాకాలం నుంచి శీతాకాలం వచ్చేస్తోంది. సీజన్ మారడంతో శరీరంలో ఇమ్యూనిటీ తగ్గి వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. దీనికితోడు ఎప్పుడూ ఉండే ఎనీమియా. డయాబెటిస్, చర్మ సమస్యలు మరింత పెరగవచ్చు. మరి ఈ సమస్యల్నించి ఎలా ఉపశమనం పొందాలి..ఆ వివరాలు తెలుసుకుందాం..
Health Benefits: నిత్య జీవితంలో మనిషి ఎదుర్కొనే దాదాపు అన్ని రకాల వ్యాధులకు పరిష్కారం లేదా చికిత్స ప్రకృతిలో లభించే వివిధ రకాల మొక్కలు, ఆకుల్లో ఉందని ఆయుర్వేద శాస్త్రం అనాదిగా చెబుతోంది. ఇందులో అతి ముఖ్యమైంది గిలోయ్ మొక్క ఆకులు. రోగ నిరోధక శక్తిని పెంచడంలో గిలోయ్ ఆకుల జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా ఇతర ప్రయోజనాలు తెలుసుకుందాం..
చర్మ సమస్యలు ఆయుర్వేద వైద్య పండితుల ప్రకారం గిలోయ్ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఫలితంగా మన శరీరంలో రక్త సరఫరా మెరుగుపడి చర్మం ఫిట్‌గా ఉంటుంది. ఏ విధమైన చర్మ సమస్యలు కూడా తలెత్తవు.
జ్వరం, దగ్గు, జలుబు సమస్యలు సీజన్ మారడంతో తరచూ జ్వరం, జలుబు, దగ్గు సమస్యలు బాధిస్తాయి. ఈ క్రమంలో రోజూ గిలోయ్ జ్యూస్ తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి సీజనల్ వ్యాధులు నియంత్రణలో ఉంటాయి.
కంటి చూపు కంటి చూపు పెంచేందుకు రోజూ గిలోయ్ జ్యూస్ తాగాలని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు. ఓ నెలరోజులు ఇలా చేస్తే కంటి చూపు అద్భుతంగా మెరుగుపడుతుందట.
డయాబెటిస్ గిలోయ్ జ్యూస్ తాగడం వల్ల శరీరంలో ఇన్సులిన్ మోతాదు పెరుగుతుంది. ఫలితంగా శరీరంలో షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయి అందుకే డయాబెటిస్ నియంత్రణలో , ఆరోగ్యంగా ఉండేందుకు గిలోయ్ జ్యూస్ ఔషధంలా పనిచేస్తుంది.
ఎనీమియా చాలామందిలో రక్త హీనత ప్రధాన సమస్యగా కన్పిస్తోంది. ఎనీమియాతో బాధపడేవారు గిలోయ్ జ్యూస్ తాగితే మంచి ఫలితాలుంటాయి. ఇందులో ఫోలేట్, ఐరన్, విటమిన్ బి12 వంటి పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. శరీరంలో ఎనీమియాను దూరం చేస్తుంది.