Happy Dussehra wishes 2024: దసరా అమ్మవారి నవరాత్రులు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా..దసరా రోజున అందరు కూడా తమ ప్రియమైన వాళ్లకు దసరా పండుగ శుభాకాంక్షలు చెప్తుంటారు.
ప్రస్తుతం దేశంలో శరన్నావరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గమ్మ తల్లి తొమ్మిది రోజుల పాటు, ఆయా అవతారాలలో భక్తుల్ని అనుగ్రహిస్తుంటారు. ఈ తొమ్మిదిరోజులలో కూడా భక్తితో పూజలు సైతం చేస్తారు.
శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబరు 3 నుంచి అక్టోబరు 12 వరకు కొనసాగుతున్నాయి. అయితే.. అక్టోబరు 12న దసరాను జరుపుకుంటాం. దుర్గముడు అనే రాక్షసుడిని అమ్మవారి సంహారించారని చెప్తుంటారు.
చెడుపై మంచి గెలిచింనందుకు గాను ఈరోజు దుర్గ నవరాత్రి ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తారు. అయితే.. దసరా రోజున ప్రతి ఒక్కరు కూడా ఒకరికి మరోకరు మంచి జరగాలని కోరుకుంటారు. దసరాను ఎంతో గ్రాండ్ గా కూడా జరుపుకుంటారు.
దసరా రోజున వాట్సాప్, మెస్సెజ్ ల రూపంలో తమ ప్రియమైన వారికి బంధువులకు, స్నేహితులకు సందేశాలు పంపించుకుంటారు. దీని వల్ల ఒక మంచి వాతావారణం, ఆప్యాయతలు ఏర్పడతాయని చెబుతుంటారు. కొన్ని మంచి వాట్సాప్,మెస్సెజ్ సందేశాలు ఈ కింద ఇవ్వబడ్డాయి.
దుర్గమ్మ తల్లి ఆశీర్వాదం మీ కుటుంబంపైన ఎల్లవేళల ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ హ్యాపీ దసరా 2024 .. మీరు చేయబోయే ప్రతి పని కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలి.
నవదుర్గల ఆశీర్వాదం మీకు ఎల్లవేళల ఉండాలని కోరుకుంటూ.. దసరా పండుగ శుభాకాంక్షలు 2024. మీరు చేస్తున్న ఉద్యోగం, వ్యాపారంలో మంచి డెవలప్ మెంట్ ఉండాలని కోరుతూ దసరా శుభాకాంక్షలు..
చెడుపై మంచి గెలిచినందుకు దసరా పండుగ చేసుకుంటాం. అలాంటి ఈరోజు నుంచి మీకు అన్ని విధాలుగా కలిసి రావాలని దుర్గమ్మ తల్లి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ దసరా శుభాకాంక్షలు.
మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళల ఆ చల్లని తల్లి చూపు ఉండాలని కోరుకుంటూ దుర్గమ్మ తల్లి మీకు అన్ని రకాలుగా ఉన్నతిని ఇవ్వాలని కోరుకుంటూ దసరా పండుగ శుభాకాంక్షలు..