Hair Fall Remedies: ఇటీవలి కాలంలో జుట్టు రాలడం ఎక్కువైంది. ఫలితంగా చాలామందికి ఇదొక ఆందోళనగా మారింది. దీనికోసం మార్కెట్లో లభించే బ్యూటీ ఉత్పత్తులు కాకుండా ఆరోగ్యకరమైన చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మూడు బెస్ట్ టిప్స్ ఉన్నాయి.
Disclaimer ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసమే. హోమ్ రెమిడీస్ ఆధారంగా రాసింది. ఈ చిట్కాలు పాటించే ముందు వైద్యుని సంప్రదిస్తే మంచిది.
కెమికల్ ఫ్రీ షాంపూ, కండీషనర్ రసాయనాలతో కూడిన షాంపూ వినియోగించడం వల్ల కేశాలకు హాని కలుగుతుంది. కానీ సహజసిద్ధంగా లభించే పోషకాలతో తయారైన షాంపూ, కండీషనర్ వాడితే కేశాలు ఆరోగ్యంగా, పటిష్టంగా ఉంటాయి.
ఈ మూడు చిట్కాలు తప్పకుండా పాటించాలి. అంతేకాకుండా ఒత్తిడికి దూరంగా ఉండాలి. నిద్ర సరిగ్గా ఉండాలి. కేశాలు ట్రిమ్ చేసుకోవాలి. కేశాల్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
బ్యాలెన్స్ డైట్ కేశాలు పటిష్టంగా ఉండేందుకు ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ తినే ఆహారంలో తప్పకుండా ఉండేట్టు చూసుకోవాలి దీనికోసం కూరగాయలు, పండ్లు, పప్పులు, నట్స్ తప్పకుండా తీసుకోవాలి. ఇవి కేశాల్ని పటిష్టం చేస్తాయి.
ఆయిల్ మాలిష్ వారంలో రెండు సార్లు కొబ్బరి నూనె, బాదం లేదా జైతూన్ ఆయిల్‌తో తలకు మాలిష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల స్కాల్ప్‌లో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. కేశాలకు కుదుళ్ల నుంచి పోషకాలు లభిస్తాయి.