Vastu Lucky Plants: హిందూ జ్యోతిష్యశాస్త్రంలో వాస్తు శాస్త్రానికి విశేష ప్రాధాన్యత మహత్యముంది. వాస్తు ప్రకారం ఇళ్లు ఎలా ఉండాలి, ఏ జాతకం వారికి ఏ దిశ సరైంది, ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉండాలి. ఎలాంటి మొక్కలు పెంచితే మంచి జరుగుతుందనే వివరాలు విపులంగా ఉంటాయి. ఆ వివరాలు మీకోసం..
Vastu Lucky Plants: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలు లేదా చెట్లను ఇంట్లో పెంచడం మంచిది. దీనివల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ దూరమౌతుంది. ఇంట్లో సుఖ సంతోషాలు లాభిస్తాయి. బహుశా అందుకే కొన్ని మొక్కల్ని అద్భుతమైన మాయా మొక్కని కూడా అంటారు. ఇంట్లో ఎలాంటి మొక్కలు పెంచుకుంటే మంచిదో తెలుసుకుందాం..
తులసి మొక్క హిందూమతంలో తులసి మొక్కకు విశేషమైన ప్రాధాన్యతత మహత్యమున్నాయి. ఇంటి ఆవరణలో తులసి మొక్క ఉందంటే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయని అర్ధం. ఏ విధమైన సమస్యలు ఉండవు.
స్పైడర్ ప్లాంట్ స్పైడర్ ప్లాంట్ అనేది వాస్తవానికి ఓ ఇండోర్ ప్లాంట్ దీని గాలి చాలా స్వచ్ఛంగా ఉంటుంది ఇది ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్యపరంగా మంచిది. ఇతరత్రా సమస్యలు కూడా దూరమౌతాయి.
షమీ చెట్టు షమీ చెట్టు అనేది సాధారణంగా రోడ్లపై ఉండేదే. ఇంటి ఆవరణలో ఈ చెట్టు ఉంటే శివుడి కటాక్షం లభిస్తుందంటారు. ఎందుకంటే ఈ చెట్టు శివుడికి ప్రీతిపాత్రమైంది. దీనివల్ల శని దేవుడి అశుభ ప్రభావం ఉండదు.
మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ మొక్కను ఇంట్లో చాలామంది పెంచుకుంటారు. సక్రమ పద్దతిలో పెంచుకుంటే ఆ ఇంట్లో డబ్బు సంబంధిత సమస్యలు ఉండవని అర్ధం. ఆదాయం, అటు లాభాలు కూడా పెరుగుతాయని భావం
అపరాజిత మొక్క తులసి మొక్కలానే అపరాజిత మొక్కను హిందూవులు అత్యంత పవిత్రంగా పిలుస్తారు. ఈ మొక్క ఇంటి పరిసరాల్లో ఉంటే లక్ష్మీ దేవి కటాక్షం ప్రాప్తిస్తుందని అర్ధం.