Gold Rate: పసిడి ప్రియులకు చుక్కలు చూపిస్తున్న బంగారం ధర..తులంపై రూ. 3వేలు పెరిగిన పసిడి


Gold Rate: పసిడి ప్రియులకు బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ధరలు మళ్లీ భారీగా పెరుగుతుండటంతో పసిడి ప్రియుల్లో ఆందోళణ మొదలైంది. గత వారం రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్న పసిడి ధరలు..వారం రోజుల్లో రూ 3వేలకుపైగా పెరిగింది.  అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతుండటమే దీనికి కారణం. వెండి రేట్లు మాత్రం కాస్త ఊరట కల్పిస్తున్నాయి. ఈక్రమంలో నవంబర్ 24వ తేదీ హైదరాబాద్ మార్కెట్లో తులం బంగారం ధర ఎంత పలుకుతుందో తెలుసుకుందాం. 
 

1 /5

Gold Rate: బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ధరలు  కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. గతవారం రోజుల్లో ప్రతిరోజు బంగారం ధర పెరిగింది. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గిస్తున్న వార్తలతో పసిడి ధరలు మళ్లీ పెరుగుతున్నాయని బులియన్ మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచాక బంగారం ధరలు భారీగా పోతున్నాయి. నవంబర్ తొలి అర్థభాగంలో బంగారం ధరలు దాదాపు రూ. 5వేల వరకు పడిపోయాయి. దీంతో బంగారం ప్రియులు కొనుగోళ్లు  చేసేందుకు సిద్ధం అయ్యాయి.

2 /5

ఇప్పుడు బంగారం ధరలు మళ్లీ వరుసగా పెరుగుతున్నాయి.  కానీ ఇప్పుడు బంగారం ధరలు మళ్లీ వరుసగా పెరుగుతున్నాయి. గత వారం రోజుల్లోనే తులం బంగారం ధర రూ. 3వేలకుపైగా పెరిగింది. ఈక్రమంలో హైదరాబాద్ మార్కెట్లో నవంబర్ 24వ తేదీన తులం బంగారం ధర ఎంతకు చేరిందనే విషయాన్ని తెలుసుకుందాం. 

3 /5

అంతర్జాతీయ మార్కెట్లలోనూ బంగారం ధరలు రికార్డు గరిష్టాలవైపు దూసుకెళ్తున్నాయి. క్రితంరోజుతో పోలిస్తే నేటి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం స్పాట్ బంగారం ధర ఒక ఔన్సుకు 2716 డాలర్లు పలుకుతోంది. అలాగే స్పాట్ సిల్వర్ ధర ఔన్సుకు 31. 36 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. మరోవైపు భారత రూపాయి మారకం విలువ రూ. 84.424 దగ్గర అవుడవుతోంది. 

4 /5

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా ఏడోరోజూ భారీగా పెరిగాయి. నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులంపై రూ. 750మేర పెరిగింది. దీంతో పది గ్రాముల బంగారం ధర రూ. 73వేల మార్క్ తాకింది.

5 /5

24క్యారెట్ల బంగారం ధర ఇవాళ తులంపై రూ. 820 పెరిగింది. దీంతో తులం బంగారం ధర రూ. 79,640 దగ్గరకు ఎగబాకింది. గతవారం రోజుల్లో 24క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర తులానికి రూ. 4000 మేర పెరగడం గమనార్హం.