Gold Rate Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు మరోసారి షాకిచ్చాయి. పండగలు, పెళ్లిళ్ల సీజన్ ముందు భారీగా పెరిగింది. గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధర శుక్రవారం, శనివారం భారీగా పెరిగింది. బంగారం దారిలో వెండి కూడా పయనిస్తోంది. వెండి ధరలు కూడా భారీగానే పెరిగాయి. హైదరాబాద్ తోపాటు దేశంలోని ప్రధాన నగరంలో బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం.
Gold Rate Today 14th september: సెప్టెంబర్ 14 శనివారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. నేడు 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.74,450 పలుకుతోంది. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర 68,250 పలుకుతోంది. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర ఏకంగా రూ.1300 పెరిగింది. దీంతో బంగారం ధర ఆల్ టైం గరిష్ట స్థాయికి అతి సమీపానికి చేరు
గతంలో బంగారం ధర 75 వేల రూపాయలు ఆల్ టైం గరిష్ట స్థాయిని తాకింది. ఇది ఇలా ఉంటే బంగారం ధర భారీగా పెరగడానికి ప్రధాన కారణం అమెరికా మార్కెట్లో ఒక ఔన్స్ బంగారం ధర నేడు 2600 డాలర్లు దాటింది.
నిన్న ఇదే బంగారం 2500 డాలర్లుగా ఉంది. పసిడి ధర ఒక్కసారిగా 100 డాలర్లు దాటడంతో నేడు దేశీయంగా కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈ మధ్యకాలంలో ఒకే రోజు వెయ్యి రూపాయల ధర పెరిగిన దాటిన సంఘటన నేడు నమోదు అవడం గమనార్హం.
బంగారం ధరలు విపరీతంగా పెరగడం వెనుక అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు కూడా కారణంగా చెప్పవచ్చు. అమెరికా డాలర్ విలువ 9 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది.
దీనికి తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక భేటీలో వడ్డీరేట్లు తగ్గిస్తారనే వార్తలు బంగారం ధర పెరగడానికి ప్రధాన కారణం అవుతోంది. ఇదే ట్రెండ్ కొనసాగినట్లయితే బంగారం ధర అతి త్వరలోనే 75 వేల స్థాయిని దాటి సరికొత్త రికార్డును సృష్టిస్తుంది.
రాబోయే ఫెస్టివల్ సీజన్ అంటే దసరా నుంచి ఈ సంవత్సరం చివరి వరకు పెద్ద ఎత్తున కస్టమర్లు బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అయితే భారీగా పెరుగుతున్న ధరల నేపథ్యంలో కస్టమర్లు పసిడి ఆభరణాలు కొనుగోలు చేసేందుకు వెనకడుగు వేసే అవకాశం ఉంది.
బంగారం ధర ప్రస్తుతం ఉన్న రేంజ్ నుంచి మరి కొంచెం పెరిగితే చాలు సరికొత్త రికార్డు దిశగా అడుగులు వేయవచ్చు. ఇక ఈ సంవత్సరం చివరి నాటికి బంగారం ధర 90000 దాటిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.