Gold Rate Update 9 March 2021: బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. పసిడి ధరలతో పాటు వెండి ధరలు పెరుగుతున్నాయి. ఆల్టైమ్ కనిష్ట ధరలు నమోదు చేసిన బంగారం తాజాగా పుంజుకుంటోంది.
Gold Price Today 9 March 2021: బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. పసిడి ధరలతో పాటు వెండి ధరలు పెరుగుతున్నాయి. ఆల్టైమ్ కనిష్ట ధరలు నమోదు చేసిన బంగారం తాజాగా పుంజుకుంటోంది. Also Read: Taxpayers Alert: మార్చి 31వ తేదీలోగా ఈ పనులు మీరు పూర్తి చేయాలని మరువొద్దు
తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్ (Hyderabad)లలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. తాజాగా రూ.320 మేర పెరగడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.45,820 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.290 పెరగడంతో బంగారం ధర రూ.42,000 అయింది. Also Read: EPF Interest Rate: EPFO ఖాతాదారులకు కేంద్రం శుభవార్త, 6 కోట్ల మంది హర్షం
దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తాజాగా రూ.310 మేర బంగారం పెరగడంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,160 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,150కి చేరింది. Also Read: Reliance Jio: కేవలం రూ.22తో రిలయన్స్ జియో డేటా ప్లాన్, తక్కువ ధరకు ఎన్నో ప్రయోజనాలు
బులియన్ మార్కెట్లో వెండి ధరలు భారీగా పెరిగాయి. వెండి ధర రూ.800 మేర పెరగడంతో 1 కేజీ వెండి ధర రూ.66,500కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.900 మేర పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో వెండి 1 కేజీ ధర రూ.71,000కి చేరింది. Also Read: 7th Pay Commission Latest News: ఇన్కమ్ ట్యాక్స్ అదనపు ప్రయోజనాలు పొందాలనుకుంటే Govt Employeesకు శుభవార్త