Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్‌లో స్వల్పంగా పుంజుకున్న బంగారం ధరలు, Silver Price

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు తాజాగా స్వల్పంగా పెరిగాయి. పసిడి ధరలు నెల రోజుల కనిష్ట ధరలు నమోదు చేసిన తరువాత పుంజుకుంటున్నాయి. 

Gold Rate Update 8 March 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు తాజాగా స్వల్పంగా పెరిగాయి. పసిడి ధరలు నెల రోజుల కనిష్ట ధరలు నమోదు చేసిన తరువాత పుంజుకుంటున్నాయి. 

1 /4

Gold Price Today In Hyderabad 8 March 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు తాజాగా స్వల్పంగా పెరిగాయి. పసిడి ధరలు నెల రోజుల కనిష్ట ధరలు నమోదు చేసిన తరువాత పుంజుకుంటున్నాయి. మరోవైపు ఆల్‌టైమ్ గరిష్ట ధరలు నమోదు చేసిన వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాలతో సహా దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగినా దాదాపు నెల రోజుల కనిష్ట ధరలకు దగ్గరగా మార్కెట్ అవుతున్నాయి. Also Read: Taxpayers Alert: మార్చి 31వ తేదీలోగా ఈ పనులు మీరు పూర్తి చేయాలని మరువొద్దు

2 /4

తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ (Hyderabad)లలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. తాజాగా రూ.270 మేర పెరగడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.45,500 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.260 పెరగడంతో బంగారం ధర రూ.41,710 అయింది. Also Read: EPF Interest Rate: EPFO ఖాతాదారులకు కేంద్రం శుభవార్త, 6 కోట్ల మంది హర్షం

3 /4

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తాజాగా రూ.290 మేర బంగారం పెరగడంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,850 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,860కి చేరింది. Also Read: Reliance Jio: కేవలం రూ.22తో రిలయన్స్ జియో డేటా ప్లాన్, తక్కువ ధరకు ఎన్నో ప్రయోజనాలు

4 /4

బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధర రూ.280 మేర పెరగడంతో 1 కేజీ వెండి ధర రూ.65,700కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.200 మేర పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.70,100 వద్ద మార్కెట్ అవుతుంది. Also Read: HDFC home loan interest rates: ఇల్లు కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. హోమ్ లోన్స్ వడ్డీ రేట్లు తగ్గించిన HDFC