Gold at Indians: భారతీయుల వద్ద ఎంత బంగారం ఉంది, ఎంత తాకట్టు పెట్టారు

బంగారం ధరల్లో ఎప్పుడూ అప్ అండ్ డౌన్ ఉంటుంది. గత కొద్ది రోజులుగా పెరుగుతూ కన్పించిన బంగారం ధర ఇవాళ కొద్దిగా తగ్గింది. వాస్తవానికి బంగారం అంటే భారతీయులకు చాలా మక్కువ. ఇది అనాదిగా వస్తున్నదే. ఎప్పుడైనా డబ్బులు అవసరమైతే బంగారం కుదువ పెట్టి తీసుకుంటారు. ఓ అంచనా ప్రకారం భారతీయుల వద్ద ఏకంగా 27 వేల టన్నుల బంగారం ఉందని సమాచారం. ఇందులో 20 శాతం అంటే 5300 టన్నుల బంగారం లోన్ రూపంలో ఉందని తెలుస్తోంది. 

Gold at Indians: బంగారం ధరల్లో ఎప్పుడూ అప్ అండ్ డౌన్ ఉంటుంది. గత కొద్ది రోజులుగా పెరుగుతూ కన్పించిన బంగారం ధర ఇవాళ కొద్దిగా తగ్గింది. వాస్తవానికి బంగారం అంటే భారతీయులకు చాలా మక్కువ. ఇది అనాదిగా వస్తున్నదే. ఎప్పుడైనా డబ్బులు అవసరమైతే బంగారం కుదువ పెట్టి తీసుకుంటారు. ఓ అంచనా ప్రకారం భారతీయుల వద్ద ఏకంగా 27 వేల టన్నుల బంగారం ఉందని సమాచారం. ఇందులో 20 శాతం అంటే 5300 టన్నుల బంగారం లోన్ రూపంలో ఉందని తెలుస్తోంది. 

1 /5

రికార్డు స్థాయిలో బంగారం ధర ప్రస్తుతం మార్కెట్‌లో బంగారం ధర రికార్డు స్థాయికి చేరుకుంది. ఢిల్లీ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం నిన్న 66914 రూపాయలుంది. ఒక్కరోజులోనే బంగారం ధర 1225 రూపాయలు పెరిగింది.

2 /5

16.6 శాతం పెరిగిన బంగారం గత ఏడాదిలో బంగారం ధర 16.6 శాతం పెరిగింది. అటు గోల్డ్ లోన్ అయితే 17 శాతం పెరిగింది. ఈ ట్రెండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ గోల్డ్ లోన్ మంజూరు చేసే ఎన్‌బీఎఫ్‌‌సి సంస్థలపై కఠిన ఆంక్షలు విధించింది. 

3 /5

2029 వరకూ గోల్డ్ లోన్ వ్యాపారం 10 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా. ఇందులో బ్యాంకుల వాటా దాదాపుగా 40 శాతం ఉంటుంది. 

4 /5

ఎవరి వాటా ఎంత దేశంలోని గోల్డ్ లోన్ మార్కెట్‌లో ఆర్గనైజ్డ్ సెక్టార్ వాటా దాదాపుగా 40 శాతం ఉంది. అంటే 6 లక్షల కోట్లు. దేశంలో గోల్డ్ లోన్ మార్కెట్  విలువ 15 లక్షలుగా ఉంది.

5 /5

గోల్డ్ లోన్ మార్కెట్ విలువ దేశంలో గోల్డ్ లోన్ మార్కెట్ విలువ దాదాపుగా 15 లక్షల కోట్లుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం ఏడాదిలో 17 శాతం పెరిగింది. 2029 వరకూ ఏడాదికి 12.22 శాతం పెరగవచ్చు.