Gold Loan: గోల్డ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి..లేదంటే నష్టపోతారు..!!

Gold Loan: మనలో చాలా మంది బ్యాంకులో గోల్డ్ పెట్టి లోన్ తీసుకుంటారు. ఇతర లోన్స్ తో పోల్చితే బంగారం రుణసంస్థలు కూడా తక్కువ సమయంలోనే లోన్ ఇస్తాయి. వీటిపై వడ్డీ కూడా తక్కువగా ఉంటుంది. అంతేకాదు నియమనిబంధనలు కూడా సులభంగా ఉంటాయి. అయితే బ్యాంకులో మీ విలువైన బంగారాన్ని తాకట్టు పెట్టినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీప్పనిసరిగా తీసుకోవాలి. అంతేకాదు లోన్ గురించి కీలక విషయాలు తెలుసుకోవాలి.ఎలాంటి విషయాలు తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం. 
 

1 /6

Gold Loan Eligibility: మనలో చాలా మందికి అత్యవసరంగా డబ్బు అవసరం ఉంటే ముందుగా గుర్తుకు వచ్చేవి బ్యాంకులు. బ్యాంకులు కాకుండా బయట వ్యక్తుల వద్ద  డబ్బులు తీసుకుంటే అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. బ్యాంకుల్లో అయితే వడ్డీ తక్కువ. చాలా లోన్స్ అందుబాటులో ఉంటాయి. తక్కువగా వడ్దీతో తక్కువ సమయంలో లోన్ తీసుకోవాలంటే గోల్డ్ లోన్ ముందు వరుసలో ఉంటుంది. ఎమర్జెన్సీ సమయంలో గోల్డ్ లోన్ వేగంగా మన చేతికి అందుతుంది. బ్యాంకులు కూడా తక్కువ సమయంలోనే లోన్ యాక్టివేట్ చేస్తారు.అయితే బ్యాంకులో గోల్డ్ లోన్ తీసుకునే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. లేదంటే నష్టపోవాల్సి వస్తుంది. ఎలాంటి విషయాలు తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.   

2 /6

గోల్డ్ లోన్ ఆన్ లైన్లో అప్లై చేసుకోవచ్చా?  గోల్డ్ లోన్ తీసుకోవాలంటే డైరెక్టుగా బ్యాంకుకు వెళ్లాలి. కానీ ఈ మధ్య కాలంలో ఆన్ లైన్ లో కూడా అప్లయ్ చేసుకునేందుకు బ్యాంకులు అవకాశం కల్పిస్తున్నాయి. తాకట్టు పెట్టే బంగారం క్వాలిటీని టెస్ట్ చేసేందుకు బ్యాంకులు ఎగ్జిక్యూటివ్ ను మీ ఇంటికి పంపిస్తారు. తర్వాత ప్రాసెస్ కంప్లీట్ అయిన అరగంటలో లోన్ మొత్తం బ్యాంకు అకౌంట్లో క్రెడిట్ అవుతుంది.   

3 /6

ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంట్స్:  గోల్డ్ లోన్ ఒక్కటే కాదు ఎలాంటి లోన్ తీసుకున్నా బ్యాంకులు వాటిపై ప్రాసెసింగ్ ఫీజులు వసూలు చేస్తాయి. బంగారంపై రుణాలకు సంబంధించి లోన్ మొత్తం 0-2శాతం వరకు ఫీజు వసూలు చేస్తాయి బ్యాంకులు . వాటిపై జీఎస్టీ అదనంగా ఉంటుంది. బ్యాంకును బట్టి ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. గోల్డ్ తీసుకునేందుకు లోన్ తీసుకునే వ్యక్తి అడ్రస్ ప్రూఫ్, పాన్ కార్డ్, ఫొటోలు అవసరం ఉంటాయి. 

4 /6

ఓవర్ డ్రాఫ్ట్  కొన్ని షెడ్యూల్డ్ బ్యాంకులు గోల్డ్ లోన్ పై ఓవర్ డ్రాఫ్టు కల్పిస్తున్నాయి. లోన్ మొత్తాన్ని అదే బ్యాంకులో ఉండే ఓవర్ డ్రాఫ్ట్అకౌంట్లో డిపాజిట్ చేస్తారు. అకౌంట్లో ఉన్న డబ్బులో కావాల్సినంత మనం తీసుకోవచ్చు. తీసుకున్న దానికి మాత్రమే వడ్డీ కట్టాల్సి ఉంటుంది. లోన్ టెన్యూర్ ముగిసిన తర్వాత అసలుతోపాటు వడ్డీ కూడా చెల్లించాలి. 

5 /6

ఎంత లోన్ ఇస్తారు?  గోల్డ్ పై లోన్స్ తీసుకుంటే అధిక లోన్ టు వాల్యూరేషియో ఉంటుంది. ఆర్బిఐ ఆదేశాలనుసారం తాకట్టు పెట్టిన బంగారం విలువలో 75శాతం వరకు లోన్ తీసుకోవచ్చు.  ఆ సమయంలో పది గ్రాముల బంగారం ఉన్న ధరపై లోన్ ఆధారపడి ఉంటుంది.   

6 /6

గోల్డ్ లోన్ కు ఎవరు అర్హులు?  ఇతర లోన్స్ తో పోల్చితే గోల్డ్ పై లోన్ తీసుకునేందుకు చాలా తక్కువ కండిషన్న్ ఉంటాయి. ఆదాయానికి సంబంధించిన ప్రూఫ్స్ అవసరం లేదు. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నా ప్రాబ్లమ్ ఉండదు. బంగారం విలువ ఆధారంగా మాత్రమే లోన్ ఇస్తారు. బ్యాంకు ఖాతాతోపాటు 18ఏండ్ల వయస్సు నిండిన వారికి బంగారం లోన్ ఇస్తాయి బ్యాంకులు.