Gold and Silver Price Today: బంగారం ధరలు తగ్గనంటున్నాయి. మరోసారి తులం 80వేలకు చేరువయ్యే దిశగా పరుగులు పెడుతున్నాయి. తాజాగా శుక్రవారం డిసెంబర్ 13వ తేదీ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold and Silver Price Today: బంగారం ధరలు భారీగా పెరుగుతూ రికార్డ్ వైపు దూసుకెళ్లుతున్నాయి. మరోసారి 80వేలకు చేరువయ్యే దిగా అడుగులు వేస్తోంది. డిసెంబర్ 13వ తేదీ శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79, 509గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72, 889 పలుకుతోంది. బంగారం ధరలు భారీగా పెరుగుతున్ననేపథ్యంలో మరోసారి బంగారం ప్రియులకు ఆందోళణ నెలకొంది. బంగారం మళ్లీ ఎందుకు పెరుగుతున్నాయో చూద్దాం.
బంగారం ధరలు పెరగడానికి అంతర్జాతీయంగా నెలకున్న పరిస్థితులతో ముడిపడి ఉంది. ముఖ్యంగా బంగారం ధర గడిచిన వారం రోజులుగా తగ్గుతూ వస్తోంది. అయితే ఇప్పుడు మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం అమెరికాలో కీలక వడ్డీ రేట్లను ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ తగ్గిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇది కూడా బంగారం ధరలు పెరిగేందుకు ప్రధాన కారణమని చెప్పవచ్చు.
బంగారం ధరలు పెరిగేందుకు మరో కారణం సిరియా సంక్షోభం కూడా కారణంగా చెప్పవచ్చు. సిరియాలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూలిపోయి తిరుగుబాటుల ప్రభుత్వం ఏర్పడటంతో అరబ్ దేశాల్లో మరోసారి అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. ఇది చమురు ఉత్పత్తిపైనా కూడా డైరెక్టుగా ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది. కాబట్టి బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగే అవకాశం కనిపిస్తుంది.
అటు అమెరికా స్పాట్ మార్కెట్లో ఒక ఔన్స్ బంగారం ధర 2700 డాలర్లను దాటింది. దీంతో బంగారం ధరలు భారీగా పెరగడం కూడా దేశీయంగా గమనించవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడం కూడా దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
ఇక చైనా మరోసారి బంగారం విపరీతంగా కొనుగోలు చేసేందుకు రెడీ అవుతోంది. ఫలితంగా బంగారం ధరలు పెరగడానికి ఛాన్ ఉంది. బంగారం ధరలు పెరగడానికి ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా నెలకున్న డిమాండ్ కూడా కారణమనం చెప్పవచ్చు.
బంగారం ధరలు పెరిగేందుకు మరో కారణం స్టాక్ మార్కెట్లో పతనం కూడా ఒక కారణంగా మనం చెప్పవచ్చు. స్టాక్ మార్కెట్ పతనం అయ్యే కొద్దీ బంగారం ధరలు కూడా విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక కూడా కారణంగా మనం చెప్పవచ్చు.