Ganesh Chaturthi 2024: వినాయకుడికి ఇష్టమైన ఈ పండ్లను ప్రసాదంగా తీసుకుంటే ఇమ్యూనిటీ అమాంతం పెరగడం ఖాయం

Vinayaka Chaturthi 2024: మరో రెండు రోజుల్లో వినాయక చవితి పండగ రాబోతోంది. ఈ పండగను హిందువులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. 9 రోజుల పాటు భక్తులచేత బొజ్జగణపయ్య పూజలందుకుంటాడు. అయితే వినాయకచవితి జరుపుకునే 9 రోజుల పాటు రకరకాల నైవేద్యాలు లంబోదరుడికి సమర్పిస్తారు. వినాయకుడికి ఇష్టమైన ఈ పండ్లను మనం ప్రసాదంగా తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఆ పండ్లు ఏవో చూద్దాం. 
 

1 /6

Vinayaka Chaturthi: సెప్టెంబర్ 7వ తేదీ శనివారం రోజు వినాయక చవితి పండగను ఎంతో ఘనంగా జరుపుకోనున్నాము. జీవితంలో అన్ని అడ్డంకులు తొలగిపోయి..శ్రేయస్సు, విజయం విజ్నానం, ఆరోగ్యం, సంతోషాన్ని తీసుకురావడానికి వినాయకుడిని ముందుగా పూజిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం వినాయక చవితి శుక్లపక్ష చతుర్థి లేదా భాద్రపద మాసంలో జరుపుకుంటారు. వినాయక చవితి తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరుగుతుంది. ఈ 9 రోజులు స్వీట్లు, మోదక, నువ్వులు, బెల్లం మోదంక, లడ్డూలు ఇతర నైవేద్యాలు సమర్పిస్తారు. వినాయకుడికి నైవేద్యంగా పెట్టే పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలుసా.   

2 /6

బ్లాక్ ఫం పండ్లను వినాయకుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ పండ్లలో విటమిన్ ఎ, సి, కె వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.   

3 /6

సీతాఫలం వినాయకుడి పూజలో తప్పనిసరిగా ఉంటుంది. ఇందులో విటమిన్ ఎ, బి6, సి పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి శరీరంలో బలమైన ఇమ్యూనిటీని పెంపొందిస్తాయి. ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి. వాపు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే లుటిన్ కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 

4 /6

వినాయకుడికి వెలక్కాయ అంటే చాలా ఇష్టం. వెలక్కాయ లేని నైవేద్యాన్ని ఊహించుకోలేము. ఈ వెలక్కాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో కాల్షియం, టానిన్, ఫాస్పరస్, ఫైబర్, ప్రొటీన్, ఐరన్ ఉంటుంది. ఈ పండును ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇది గుండె, కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇన్ఫెక్షన్ల నుంచి పోరాడుతుంది. మలబద్ధకాన్ని నివారించడంలో వెలక్కాయ ఎంతో మేలు చేస్తుంది.   

5 /6

జామకాయ డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు అద్బుతంగా పనిచేస్తుంది.ఇందులో క్యాన్సర్ తోపాటు ప్రాణాంతక వ్యాధులతో పోరాడే గుణాలు ఉంటాయి. జామకాయలో నారింజలో కంటే ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. కంటిచూపు, గుండె సంబంధిత సమస్యలతో పోరాడుతుంది. మలబద్ధకంతో బాధపడేవారికి జామకాయం ఎంతో మేలు చేస్తుంది.   

6 /6

అరటిపండును అందరూ ఇష్టంగా తింటారు. ఇందులో పొటాషియం, ఫైబర్, విటమిన్లు, ఎ, సి, బి6, మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. అరటి పండు తింటే అధిక రక్తపోటుతో బాధపడేవారికి మేలు చేస్తుంది. వీటిని రెగ్యులర్ గా తింటే బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది. అరటిలోని పోషకాలు ఇమ్యూనిటినీ పెంపొందిస్తాయి. ఆస్తమా, క్యాన్సర్, షుగర్, గుండె సంబంధిత సమస్యల నుంచి కాపాడుతుంది.